Wife-Husband : వివిధ కారణాల వల్ల కొంత మంది భార్యాభర్తల మధ్య వయసులో చాలా తేడా ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో అయిన సంబంధాలను చేసుకోవటం వల్లో, తెలిసో తెలియకో తప్పుచేయటం వల్లో ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది. అయితే దీనివల్ల ఆ దంపతుల సంసారం సాఫీగా సాగుతుందా? తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతుందా అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. భార్య కన్నా భర్త ఏజ్ బార్ అయితే సమస్యలు తలెత్తుతాయనే మాట పూర్తిగా అబద్ధం. ఎందుకంటే ఒకటీ రెండేళ్ల వయసు గ్యాప్ ఉన్న జంటల మధ్య కూడా గొడవలు తలెత్తుతున్నాయి కదా. దానికేమంటారంటే ఇతరత్రా అంశాలను సాకుగా చూపుతారు. వయసు ఎక్కువ తేడా ఉన్నవాళ్ల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటే మాత్రం ఎదుటివాళ్లు ఇక వేరేదేదీ చూడరు. వాళ్లకు ఏజ్ గ్యాజ్ ఒక్కటే కనిపిస్తుంది. అసలు తగాదా ఎందుకు జరిగిందని ఆలోచించరు.
Wife-Husband : what-will-happend-if-husband-is-age-bar-than-wife
భార్యాభర్తల మధ్య వయసు తేడా పదేళ్ల కన్నా ఎక్కువుంటే వాళ్ల ఆలోచనలు కలవవు అంటారు. అది కూడా నిజం కాదు. ఎందుకంటే ఆడవాళ్లు మగవాళ్ల కన్నా శారీరకంగా, మానసికంగా త్వరగా ఎదుగుతారు. కాబట్టి ఏజ్ గ్యాప్ ఉన్నా కవర్ అవుతుంది. ఏదైనా అర్థంచేసుకునేదాన్నిబట్టే ఉంటుంది. ఆలూమగల మధ్య అన్యోన్యతకి పరస్పర అవగాహన ముఖ్యం. వయసు తక్కువ కాబట్టి సతీమణికి తొందరగా కోపం రావటం సహజం. దానికి అనుగుణంగా మగవాళ్లు ఆ కొద్దిసేపు సైలెంట్ అయితే సరిపోతుంది. ఏజ్ లో పెద్దోళ్లు కావటం వల్ల జెంట్స్ ఆమాత్రం మైండ్ మెచ్యూరిటీ ప్రదర్శించాలి. ఒకవిధంగా చెప్పాలంటే వైఫ్ అండ్ హజ్బెండ్ ఒకరికొకరు సర్దిచెప్పుకోవటానికి వాళ్ల మధ్య వయసు తేడా ఎక్కువ ఉండటం కలిసొచ్చే అంశమే. జీవిత భాగస్వాములు ఒకే వయసువాళ్లయితే ఇద్దరూ ఒకేసారి ఆవేశానికి లోనయ్యే ప్రమాదం ఉంది. ఒకే టెంపర్మెంట్ ఉంటుంది కాబట్టి.
సొసైటీలో కొంత మంది ఎప్పుడూ ఎదుటివాళ్ల లోపాలనే పట్టిచూపుతుంటారు. విమర్శించటమే పనిగా పెట్టుకుంటారు. ఈడూ జోడూ బాగాలేదంటూ సూటిపోటి మాటలు అంటూ ఉంటారు. ఆవిధంగా వాళ్లు అల్ప సంతోషం పొందుతుంటారు. అసలు ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అంటే ఏంటి? చూడటానికి చక్కగా ఉంటే చాలా?. అయినా మనం సమాజం కోసం బతకాలా? లేక మన కోసం బతకాలా?. లోకులు పలు కాకులు అనే మాట ఉండనే ఉంది. కనుక ఎవరేం అనుకున్నా పట్టించుకోకూడదు. మన వరకు మనం సంతోషంగా ఉన్నామా లేదా అనేదే చూడాలి. లైంగిక విషయాలైనా.. మరేదైనా.