sreeleela: ఘాటు అందాలతో మత్తెక్కిస్తున్న శ్రీ లీల.. పిక్స్ వైరల్

sreeleela : టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతకాలంగా కుర్ర హీరోలతో పాటు యువ హీరోయిన్ల హవా కనిపిస్తోంది. సీనియర్లు అంతా ఓ వైపు బిజీగా ఉంటే నేటితరం నటీనటులు ఇండస్ట్రీని ఊపేస్తున్నారు. మొన్నటివరకు పెద్ద హీరోల సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టగా చిన్న చిత్రాలు బాక్సాఫీసు వద్ద పరువాలేదని పించాయి. మంచి కలెక్షన్లు రాబట్టి బడా సినిమాల కంటే మేమే బెటర్ అనిపించేలా చిన్న సినిమాలు సత్తా చాటుతున్నాయి. ఇటీవల వచ్చిన ‘లవ్ స్టోరీ’ సినిమా […].

By: jyothi

Published Date - Wed - 24 November 21

sreeleela: ఘాటు అందాలతో మత్తెక్కిస్తున్న శ్రీ లీల.. పిక్స్ వైరల్

sreeleela : టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతకాలంగా కుర్ర హీరోలతో పాటు యువ హీరోయిన్ల హవా కనిపిస్తోంది. సీనియర్లు అంతా ఓ వైపు బిజీగా ఉంటే నేటితరం నటీనటులు ఇండస్ట్రీని ఊపేస్తున్నారు. మొన్నటివరకు పెద్ద హీరోల సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టగా చిన్న చిత్రాలు బాక్సాఫీసు వద్ద పరువాలేదని పించాయి. మంచి కలెక్షన్లు రాబట్టి బడా సినిమాల కంటే మేమే బెటర్ అనిపించేలా చిన్న సినిమాలు సత్తా చాటుతున్నాయి. ఇటీవల వచ్చిన ‘లవ్ స్టోరీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడగా.. ‘పెళ్లి సందD’వంటి చిన్న సినిమా మంచి విజయం సాధించింది. ఈ విజయానికి నటీనటులు ఓ ప్లస్ పాయింట్ అయితే, సీనియర్ దర్శకులు రాఘవేంద్రరావు పర్యవేక్షణ కూడా కలిసొచ్చిందని చెప్పవచ్చు.


sree leela

sree leela



‘పెళ్లిసందD’సినిమాలో హీరో శ్రీకాంత్ తనయుడు ‘రోషన్’లీడ్ రోల్‌లో యాక్ట్ చేయగా హీరోయిన్‌గా ‘శ్రీ లీల’నటించింది. ఈ సినిమాను ‘గౌరి’ డైరెక్షన్ చేయగా, మాధవి కొవెలమూడి, శోభుయార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో ప్రధానంగా హీరోయిన్ నటన గురించి చెప్పుకోవాలి. అందం, అభినయంతో పాటు డ్యాన్స్ కూడా ఇరగదీసింది. శ్రీ లీల పుట్టి పెరిగింది అమెరికాలో అయినా చదువు అనంతరం సినిమా రంగంలో ఎంట్రీ ఇచ్చింది. పెళ్లిసందD సినిమాకు ముందు కన్నడలో ‘కిస్’ అనే మూవీలో నటించింది.


sreeleela

sreeleela

sree leela

sree leela



20ఏళ్ల వయసులోనే టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్ర హీరోయిన్ తొలిసినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. తన డెబ్యూ చిత్రం హిట్ అవడంతో ఈ కన్నడ బ్యూటీకి ఆఫర్లు వరుసగా తలుపు తడుతున్నట్టు తెలిసింది. తాజాగా శ్రీ లీల ఫోటోషూట్‌కు సంబంధించి పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వైట్ అండ్ బ్లాక్ ఔట్‌ఫిట్‌తో పాటు పింక్ కలర్ చుడీదార్స్‌లో ఒక్కసారిగా తళుక్కుమని మెరిసింది. బక్కచిక్కిన అందంతో కుర్రకారును తెగ ఆకట్టుకుంటోంది. తన క్యూట్ స్మైల్‌తో యవత గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న శ్రీలీల అందాలను మీరు కూడా చూసేయండి..

sree leela

sree leela

Tags

Latest News

Related News