Taapsee Pannu : సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు అవకాశాలు పట్టుకోవడం అంటే పెద్ద టాస్క్ అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వస్తున్న వారికి మాత్రం అనేక అవమానాలు ఎదురవుతూనే ఉంటున్నాయి. హీరోయిన్లు మాత్రం కమిట్ మెంట్ ఇస్తేనే వారికి అవకాశాలు వస్తాయని ఇప్పుడు టాక్ నడుస్తోంది.
మీటూ ఉద్యమం తర్వాత చాలామంది హీరోయిన్లు తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. ఇప్పుడు తాజాగా హీరోయిన్ తాప్సీ కూడా ఎమోషనల్ కామెంట్లు చేసింది. మొన్నటి వరకు సౌత్ లో మంచి అవకాశాలు అందుకున్న ఆమె ఇప్పుడు బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటోంది.
కాగా తాజాగా తాప్సీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో హీరోలతో సమానమైన అవకాశాలు, రెమ్యునరేషన్ హీరోయిన్లకు రావట్లేదు. హీరోలకు ఈజీగా అవకాశాలు వస్తున్నాయి. కానీ లేడీస్ కు మాత్రం కాస్టింగ్ కౌచ్ ఎదురవుతోంది. నేను కూడా గతంలో అనుభవించాను.
కెరీర్ మొదట్లో ఓ చిన్న సినిమాలో ఆడిషన్ కోసం వెళ్లాను. అక్కడకు వెళ్లిన తర్వాత సదరు డైరెక్టర్ నాతో కాస్త అసభ్యంగా ప్రవర్తించాడు. నీకు అవకాశం ఇస్తా.. కానీ నువ్వు రాత్రి ఆడిషన్ కోసం రావాల్సి ఉంటుంది అన్నాడు. నాకు విషయం అర్థమైంది. అందుకే అక్కడి నుంచి వచ్చేశాను అంటూ చెప్పుకొచ్చింది తాప్సీ.
Read Also : Mahesh Babu : మహేశ్ బాబు ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. స్టార్ హీరోలెవరూ పనికి రారుగా..!
Read Also : Samantha : నా లైఫ్ ను నాశనం కావొద్దనే ఇలా చేస్తున్నా.. సమంత ఎమోషనల్..!