Ester Noronha : హీరోయిన్ లు కూడా ఈ నడుమ కాస్టింగ్ కౌచ్ మీద స్పందిస్తూ వస్తున్నారు. మీటూ ఉద్యమం తర్వాత కొందరు దానిపై ధైర్యంగా మాట్లాడుతూ ఉంటే.. మరికొందరు మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు. ఇక తాజాగా మరో హీరోయిన్ కూడా స్పందించింది. ఆమె ఎవరో కాదండోయ్.. ఎస్తేర్ నోరోహ.
స్టార్ సింగర్ నోయెల్ భార్యగా ఎస్తేర్ నోరోన్హా అప్పట్లో పరిచయం అయింది. కానీ భర్త నుంచి విడాకులు తీసుకుని హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. కానీ స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. హీరోయిన్ గా ఎక్కువగా ఛాన్సులు రాలేదు. దాంతో ఆమె రీసెంట్ గా ఓ బోల్డ్ సినిమాలో కూడా నటించింది.
సంస్కార్ కాలనీ మూవీలో ఆమె రెచ్చిపోయి లిప్ లాక్ లు కూడా ఇచ్చింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది. దాన్ని ఎవరూ కాదనరు. టాలీవుడ్ కూడా అతీతం కాదు. నేను కూడా మొదట్లో ఓ సినిమాలో నటిస్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కున్నాను.
ఓ హీరో నన్ను అసభ్యకరంగా తాకేందుకు ప్రయత్నించాడు. బాడీపై చేతులు వేశాడు. దాంతో నాకు చిరాకేసింది. కానీ హీరో కాబట్టి గొడవ ఎందుకు, మళ్లీ సినిమా నుంచి తీసేస్తారేమో అని భయపడి ఏమీ అనకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాను. ఆ హీరో నుంచి కాస్త గ్యాప్ మెయింటేన్ చేశాను. ఇప్పటికీ ఆ హీరో మంచి పొజీషన్ లో ఉన్నాడు అంటూ చెప్పింది ఎస్తేర్.
Read Also : Heroine : విడాకులు తీసుకున్న హీరోతో యంగ్ హీరోయిన్ ఎఫైర్.. ఎంత మందిని పడుతుందో..!
Read Also : Ashu Reddy : వాటి సైజు పెంచుకోవడానికి సర్జరీ చేయించుకుంటున్న అషురెడ్డి..!