Aarthi Agarwal Dated Tollywood Producer : ఆర్తి అగర్వాల్ కు తెలుగులో మంచి పేరు ఉంది. ఆమె తెలుగులో చేసిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అందుకే ఆమెకు స్టార్ హీరోలు పిలిచి మరీ అవకాశాలు ఇచ్చారు. చాలా తక్కువ సమయంలో ఇండస్ట్రీలో ఆఫర్లు పొందిన హీరోయిన్లలో ఆమె కూడా ఒకరు. కానీ ఏం లాభం.. కెరీర్ లో ఆమె చేసిన కొన్ని పొరపాట్లు ఆమె జీవితాన్ని నాశనం చేశాయి.
కెరీర్ పీక్స్ లో ఉండగానే ఆమె తరుణ్ తే ప్రేమ వ్యవహారం నడిపించిందనే రూమర్లు వచ్చాయి. కానీ ఆమె మాత్రం దీనిపై పెద్దగా స్పందించలేదు. కానీ కెరీర్ పీక్స్ లో ఉండగానే ఆమె ఓ నిర్మాత ను నమ్మి మోసపోయింది. ఆమె స్టార్ హీరోయిన్ అయ్యాక ఆర్తిని అతను తన గుప్పిట్టోలనే పెట్టుకున్నాడు.
దాదాపు రెండేళ్ల పాటు అతని గెస్ట్ హౌస్ లోనే ఉండిపోయింది ఆర్తి. కెరీర్ స్టార్టింగ్ లో ఆమెకు అవకాశాలు రావడానికి ఆ నిర్మాత సాయం చేశాడు. ఆ నమ్మకంతోనే అతని గెస్ట్ హౌస్ లో ఉండి అవకాశాలు ఇప్పించమని కోరింది. కానీ ఆ నిర్మాత మాత్రం ఆమెను అన్ని విధాలుగా వాడుకుని వదిలేశాడంట.
ఈ విషయం అప్పట్లో బాగా వైరల్ అయిపోయింది. ఆర్తి అగర్వాల్ మాత్రం అతను చేసిన మోసంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఆ సమయంలో ఆమె చాలా లావుగా మారింది. చివరకు వెయిట్ తగ్గడానికి సర్జరీ చేయించుకుంటూ చనిపోయింది. ఇలా ఆ నిర్మాతను నమ్మి ఆమె కెరీర్ మొత్తం సర్వనాశనం చేసుకుంది.