Acharya : ఇటీవల రిలీజ్ చేసిన ఆచార్య సినిమాలోని టీజర్ లో చివర్లో మెగాస్టార్ మరియు మెగాపవర్ స్టార్ కనిపించడం పట్ల ఫ్యాన్స్ చాలా ఖుషీ అవుతున్నారు. వారితో పాటు మరో వైపు తల్లి చిరుతు, మరియు పిల్ల చిరుత ఉంటాయి. కానీ ఆ సినిమాలో ఆ షాట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందనేది సినిమా డైరెక్టర్ కొరటాల శివ వివరించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… బిగ్ స్క్రీన్ మీద ఈ షాట్ బ్లాక్ బస్టర్ అవుతుందని ఆయన తెలిపారు.
ఈ షాట్ కావాలని పెట్టింది కాదని సినిమా అనేది ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండడం వల్లే ఈ షాట్ ను పెట్టినట్లు ఆయన వివరించారు. ఈ షాట్ చూసిన మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతారని ఆయన వివరించారు. కేవలం మెగా అభిమానులు మాత్రమే కాదు మామూలు ప్రేక్షకులు కూడా ఫుల్ థ్రిల్ ఫీలవుతారని ఆయన చెప్పారు.
ఇక ఆచార్య సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ పాత్రలో మెరవనున్నారు. ఆయనకు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజయిన పాటలు మరియు టీజర్లకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని మేకర్స్ ప్రకటించారు.
Acharya
ఈ సినిమాకు సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ బాణీలు సమకూరుస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాదిలో సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. మెగా స్టార్ కమ్ బ్యాక్ మూవీ.. ఖైదీ నెంబర్ 150 మూవీ ఏ రేంజ్ లో హిట్ అయిందో మనకు తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కోసం కూడా ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను రామ్ చరణ్ తన సొంత నిర్మాణ సంస్థ అయిన కొణిదెల ప్రొడక్షన్ హౌజ్ లో నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ తో పాటు నిరంజన్ రెడ్డి కూడా ఈ సినిమాకు మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.