Actor Subbaraju : నటుడిగా సుబ్బరాజుకు మంచి ఇమేజ్ ఉంది. చూడటానికి హీరోలా కనిపించే ఆయన.. విలన్ పాత్రలకు పెట్టింది పేరు. కెరీర్ స్టార్టింగ్ లో ఎన్నో విలన్ పాత్రలతో మంచి ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో పాత్రలు పోషించారు. కేవలం ఇలాంటి పాత్రలే చేయాలనే ఆలోచన ఆయనకు లేదు.
ఇప్పటికీ స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూనే ఉన్నాడు. ఇదిలా ఉండగా ఆయన గతంలో చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. గతంలో సుబ్బరాజు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ఆయనకు రాపిడ్ ఫైర్ గేమ్ ఆడాల్సి వచ్చింది. ఇందులో భాగంగా మీరు హీరోగా సినిమా చేస్తే.. ఏ హీరోను విలన్ గా కోరుకుంటారు అని యాంకర్ అడిగింది.
దానికి సుబ్బరాజు స్పందిస్తూ.. నేను హీరోగా చేస్తే కచ్చితంగా అల్లు అర్జున్ ను నా సినిమాలో విలన్ గా పెట్టుకుంటాను. ఎందుకంటే ఇప్పటి వరకు ఎక్కువగా అల్లు అర్జున్ సినిమాల్లోనే విలన్ గా చేశాను. కాబట్టి అతన్ని నాకు విలన్ గా పెట్టుకుని ఫైట్ చేస్తాను అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు సుబ్బరాజు.
అంటే అల్లు అర్జున్ ను తన సినిమాలో విలన్ గా పెట్టుకుని చితక్కొట్టాలని ఉందంటూ ఇన్ డైరెక్టుగా చెప్పాడన్న మాట. ఇదంతా ఆయన కేవలం సరదా కోసమే చెప్పాడు. ఎందుకంటే బన్నీ తనకు ఎక్కువగా విలన్ పాత్రలు ఇచ్చాడు. అతని వల్లే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని సుబ్బరాజు వివరించాడు.
Read Also : Sri Reddy : ఏంటీ.. శ్రీరెడ్డికి ఇంత పెద్ద కూతురు ఉందా.. ఇన్నాళ్లకు బయట పడ్డ నిజం..!
Read Also : Chiranjeevi : శరత్ బాబు హీరోగా, చిరంజీవి విలన్ గా నటించిన మూవీ ఏదో తెలుసా..?