Actress Charmy Kaur Reacts On Dating Relationship : చార్మీ కౌర్ కు తెలుగు నాట మంచి క్రేజ్ ఉంది. ఆమె నటించిన ఎన్నో సినిమాలు మంచి హిట్ అయ్యాయి. కానీ ఎక్కువ కాలం హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ తో కలిసి సినిమాలను నిర్మించడం స్టార్ట్ చేసింది. రీసెంట్ గానే వీరద్దరూ కలిసి నిర్మించిన లైగర్ సినిమా పెద్ద ప్లాప్ అయింది.
దాంతో అప్పటి నుంచి ఆమె పెద్దగా బయట కనిపించట్లేదు. ఆమె కెరీర్ పరంగా కాకుండా వ్యక్తిగతమైన విషయాలతో ఆమె వార్తల్లో ఎక్కువగా ఉంటుంది. పూరీ జగన్నాథ్ తో ఆమె సహజీవనం చేస్తోందనే వాదన ఎప్పటి నుంచో ఉంది. వీరిద్దరూ రాసుకుని పూసుకుని తిరుగుతున్నారు. అంతే కాకుండా పార్టలు, పబ్బుల్లో ఒకరి మీద ఒకరు పడుతున్న ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి.
కానీ వీరిద్దరు మాత్రం వీరి రిలేషన్ ను బయట పెట్టలేదు. కానీ చాలా కాలం తర్వాత ఆమె ఇన్ డైరెక్టుగా తన రిలేషన్ మీద కామెంట్లు చేసింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. నేను ఎప్పుడూ లోయల్ గా ఉంటాను. పర్సనల్ గా నేను కొన్ని ఇబ్బందులు పడ్డాను.
గతంలో ఇద్దరితో డేటింగ్ చేశాను. కానీ ఆ బంధాన్ని ఎక్కువ కాలం మెయింటేన్ చేయలేక పోయాను. అందుకే పెళ్లి విషయంలో కూడా నేను గట్టి నిర్ణయం తీసుకోలేకపోయా. అందుకే సింగిల్ గా ఉండిపోయాను.
ఇప్పుడు నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అందుకే నాకు ఒంటరిగా ఉన్నాననే ఫీలింగ్ కలగదు అంటూ తెలిపింది చార్మీ. తన తర్వాత సినిమా గురించి త్వరలోనే అప్ డేట్ ఇస్తానని వెల్లడించింది.