Actress Kanishka Soni : సినిమా ఇండస్ట్రీలో రోజు రోజుకూ కాస్టింగ్ కౌచ్, కమింట్ మెంట్లు అనేవి పెరిగిపోతున్నాయి. కాగా దీనిపై కొందరు మీటూ ఉద్యమం తర్వత నోరు విప్పుతున్నారు. తమకు జరిగిన చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. అయితే బాలీవుడ్ లో ఇలాంటివి బాగా వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఓ డైరెక్టర్ పై ఆరోపణలు చేసింది సీరియల్ హీరోయిన్.
బాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు సాజిద్ ఖాన్ అప్పట్లో హిందీ బిగ్ బాస్ లో పాల్గొనడం తీవ్ర దుమారమే రేపింది. ఎందుకంటే మీటూ ఉద్యమంలో ఆయనపై చాలామంది నటీమణులు ఆరోపణలు చేశారు. ఆయన బిగ్ బాస్ లో ఉన్నప్పుడు సీరియల్ నటి కనిష్క సోని మీడియా ముందుకు వచ్చి సంచలన ఆరోపణలు చేసింది.
ఆమె మాట్లాడుతూ.. సాజిద్ ఖాన్ చాలా దుర్మార్గుడు. ఆయన అవకాశాల పేరుతో చాలామందిని వేధించాడు. అందులో నేను కూడా ఉన్నాను. ఓ సారి అవకాశం ఇప్పిస్తానని చెప్పి నన్ను ఆయన ఇంటికి పిలిచాడు. అక్కడకు వెళ్లిన తర్వాత నా నడుము చూపించమని అడిగాడు. దాంతో నాకు చాలా కోపం వచ్చింది.
కానీ నేను అతన్ని అప్పుడు ఏమీ అనలేదు. మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయాను. నా తర్వాత కూడా చాలా మందిని ఆయన వేధించాడు. కాబట్టి ఆయన్ను ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలని కోరుతున్నాను అంటూ డిమాండ్ చేసింది కనిష్క సోనీ. ఆమె చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి.
Read Also : Arjun Reddy : అర్జున్ రెడ్డి సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?
Read Also : Divi Vadthya : కమిట్ మెంట్ ఇస్తే తప్పేంటి.. ఇద్దరు ఒప్పుకుంటేనే అది జరుగుతుందిః బిగ్ బాస్ దివి