Katrina Kaif తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హీరోలతో పాటు హీరోయిన్లు కూడా మంచి గుర్తింపును సాధించుకుంటూ ముందుకు దూసుకెళ్తూ ఉంటారు అయితే డాక్టర్ డి.రామానాయుడు ప్రొడ్యూసర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన మార్క్ ను చూపిస్తూ సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్లారు అయితే రామానాయుడు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ కలియుగ పాండవులు సినిమాతో మంచి విజయాన్ని సాధించారు ఆ తర్వాత వరుస సక్సెస్ లతో దూసుకెళ్తూ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా గుర్తింపు పొందారు వెంకటేష్ హీరోగా వచ్చిన సినిమాల్లో చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ నీ సొంతం చేసుకున్నాయి వెంకటేష్ కెరీర్లో బొబ్బిలి రాజా మొదటి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఆ తరువాత వచ్చిన చాలా సినిమాలు మంచి సక్సెస్ సాధించి ముందుకు దూసుకెళ్లాయి.
రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన చంటి సినిమా తెలుగులో మంచి విజయాన్ని సాధించింది అప్పటివరకు వెంకటేష్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి ఇండస్ట్రీలో కూడా ఒక మంచి విజయాన్ని సొంతం చేసుకుంది అలాగే వెంకటేష్ ఆ సినిమాలో నటించిన నటనకు గాను అవార్డులు కూడా వచ్చాయి. ఇదిలా ఉంటే కె.విజయభాస్కర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వెంకటేష్ చేసిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా సంవత్సరం పాటు ఆడి ఇండస్ట్రీలో ఉన్న రికార్డులను బ్రేక్ చేసింది ఇప్పటికీ ఆ సినిమా టీవీలో వస్తే చూసే జనాలసంఖ్య విపరీతంగా ఉంది అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో సురేష్ బాబు నిర్మాతగా ఈ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ మల్లీశ్వరి అనే సినిమాని తెరకెక్కించారు ఈ సినిమాలో హీరోయిన్ గా కత్రినా కైఫ్ ని తీసుకున్నారు ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కత్రినాకైఫ్ కు రెమ్యూనరేషన్ గా 70 లక్షల రూపాయలు ఇస్తామని ఒప్పుకున్నారు మొదట అంతకంటే తక్కువ ఇస్తాము అన్నప్పటికీ కత్రినాకైఫ్ 70 లక్షలు ఇస్తేనే షూటింగ్ కి వస్తాను అలాగే నా హోటల్ బిల్స్ అన్ని మీరే పే చేయాలి అని చెప్పడంతో ఆమెతో కొన్ని చర్చలు జరిపి తర్వాత ఆమె చెప్పిన అన్ని కండిషన్స్ కి ఓకే చెప్పారు.
సురేష్ బాబు ఆ తర్వాత ఆమె షూటింగ్ కి రావడం మొదలు పెట్టింది.దాంతో సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఆ సినిమా రిలీజ్ అయి మంచి విజయాన్ని సాధించింది అలాగే కత్రినాకైఫ్ కి హీరోయిన్ గా మంచి పేరే వచ్చింది ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత జయంత్.సి.పరాన్జీ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన అల్లరి పిడుగు సినిమా లో హీరోయిన్ గా నటించింది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా మిగిలింది అయితే ఈ సినిమాలో నటించినందుకు గాను ఆమెకు మంచి గుర్తింపు లభించింది.
ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేయకుండా బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ అక్కడ బిజీగా మారిపోయింది అక్కడ సల్మాన్ ఖాన్ లాంటి పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన అగ్నిపత్ సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా చేసింది ఆ సాంగ్ కి మంచి పేరు వచ్చింది.అయితే తెలుగులో మల్లేశ్వరి సినిమా చేసినప్పుడు తెలుగు జనాలు యాక్టింగ్ బాగానే చేస్తుంది కాని ఆవిడకి డాన్స్ సరిగ్గా రావట్లేదు అని అన్నారు కానీ బాలీవుడ్ లో ఆమె తన డాన్స్ తోనే చాలా ఫేమస్ అయింది…