Actress Madhavi Latha : టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు ఏ ఇండస్ట్రీలో అయినా సరే ఓ విమర్శ బలంగా వినిపిస్తోంది. అదేంటంటే.. నెపోటిజం. స్టార్ హీరోల కొడుకులే స్టార్ హీరోలు అవుతున్నారు తప్ప మిగతా వారికి అవకాశం ఇవ్వట్లేదు. పైగా మిగతా వారిని తొక్కేస్తున్నారనే విమర్శలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇదే విషయంపైగా తాజాగా హీరోయిన్ మాధవీ లత కూడా స్పందించింది.
మాధవీ లత గతంలో నచ్చావులే సినిమాతో పరిచయం అయింది. ఆ తర్వాత మూడు సినిమాల్లో చేసింది. కానీ హిట్లు పడకపోవడంతో సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత రాజకీయాల్లో చేరింది. కానీ ఇప్పుడు ఇంటివద్దనే ఉంటుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో టాలీవుడ్ హీరోల మీద సంచలన ఆరోపణలు చేస్తూ ఉంటుంది.
తాజాగా ఆమె సోషల్ మీడియాలో నెపోటిజం మీద స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. టాలీవుడ్ లో ఇప్పుడు నెపోటిజమే నడుస్తోంది. కేవలం మూడు ఫ్యామిలీ పెత్తనమే ఉంది. మిగతా వారు మాత్రం స్టార్ హీరోలు కావట్లేదు. బ్యాక్ గ్రౌండ్ లేని వారిని తొక్కేసే కుట్రలే ఉన్నాయి.
మొన్నామధ్య విజయ్ దేవరొకండ మీద కూడా స్టార్ హీరోల ఫ్యాన్స్ అందరూ ఎలా టార్గెట్ చేశారో మనం చూశాం. ఇలాంటి నీచమైన పనులు చేయడం వల్లే ఎంత ట్యాలెంట్ ఉన్నా సరే స్టార్ హీరోలు కాలేకపోతున్నారు. ఇప్పటికైనా ట్యాలెంట్ ఉన్న వారికి అవకాశం ఇస్తే బాగుంటంది అంటూ చెప్పుకొచ్చింది మాధవీ లత.
Read Also : Anjali : అవును.. ముంబై హీరోయిన్లు కమిట్ మెంట్లు ఇస్తారు.. అంజలి షాకింగ్ కామెంట్లు..!
Read Also : Sai Pallavi : ఆ హీరోతో లిప్ లాక్ అంటే భయపడి సినిమా వద్దన్న సాయిపల్లవి.. ఎవరంటే..?