Actress Meena Reacts On Casting Couch : అదేంటో గానీ.. ఈ నడుమ చాలామంది కాస్టింగ్ కౌచ్ మీద ఓపెన్ గానే మాట్లాడుతున్నారు. అప్పట్లో దీనిపై మాట్లాడేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. కానీ మీటూ ఉద్యమం వచ్చిన తర్వాత అందరూ దీనిపై గట్టిగానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు తాజాగా సీనియర్ హీరోయిన్ మీనా కూడా దీనిపై స్పందించింది.
ఆమె గతంలో స్టార్ హీరోయిన్ గా ఓ ఊపు ఊపేసింది. తెలుగు, తమిళంలో కూడా ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది. హోమ్లీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని చూస్తోంది. రీసెంట్ గానే ఆమె భర్త చనిపోయాడు. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి ఆమె తేరుకుంటోంది.
ప్రస్తుతం సినిమాల్లో రాణించేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే ఆమె గతంలో చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమెకు కాస్టింగ్ కౌచ్ మీద ప్రశ్న ఎదురైంది. ఆమె మాట్లాడుతూ.. మా కాలంలో కూడా వేధింపులు ఉండేవి. కానీ నాకు ఎదురు కాలేదు.
కొందరు హీరోలు వక్రబుద్ధితో ఇలాంటి కమిట్ మెంట్లు అడుగుతారు. వారు ఇప్పటికైనా మారాలి అని కోరుకుంటున్నా అంటూ సంచలన కామెంట్లు చేసింది మీనా. అయితే ఆ హీరోల పేర్లు మాత్రం బయట పెట్టలేదు ఈ భామ. తాజాగా ఆమె చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. మరి మీనా ఏ సినిమాతో ఎంట్రీ ఇస్తుందో చూడాలి.
Read Also : Aarthi Agarwal Dated Tollywood Producer : రెండేళ్లు ఆ నిర్మాత గెస్ట్ హౌస్ లోనే ఉన్న ఆర్తి అగర్వాల్.. ఛాన్సుల కోసం..!
Read Also : Actress Ester Noronha Reacts On Casting Couch : ఆ ఇద్దరు తెలుగు హీరోలు కోరిక తీర్చమన్నారు.. హీరోయిన్ ఎస్తేర్ సంచలనం..!