Actress Pragathi : నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంత పాపులర్ అనేది మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం మాడ్రన్ అమ్మ, అత్త లాంటి పాత్రలకు ఆమె పెట్టింది పేరు. పెద్ద హీరోలకు తల్లి పాత్రలు, స్టార్ హీరోయిన్లకు తల్లి పాత్రల్లోనే ఆమె బాగా కనిపిస్తోంది.
అయితే నటి ప్రగతి గతంలో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. కానీ ఎందుకో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. కాగా ఆ సమయంలో తాను ఎందుకు స్టార్ డమ్ తెచ్చుకోలేకపోయిందో తాజాగా వెల్లడించింది ప్రగతి. ఆమె మాట్లాడుతూ.. అప్పట్లో నేను మోడలింగ్ చేస్తున్న సమయంలోనే హీరోయిన్ గా నాకు అవకాశాలు వచ్చాయి.
తమిళంలో మూడు సినిమాలకు ఒకేసారి సైన్ చేశాను. కానీ ఓ హీరో తన సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమాకు అతనే నిర్మాత. కానీ అతను నన్ను చాలా వేధించాడు. తన కోరిక తీర్చాలంటూ నా వెంట పడ్డాడు. ఓ సారి అయితే రాత్రి నా రూమ్ కు రండి.. మూవీ గురించి డిస్కస్ చేయాలని చెప్పాడు.
కానీ అతను నా నుంచి ఏం కోరుకుంటున్నాడో నాకు అర్థం అయింది. అందుకే అతని రూమ్ కు వెళ్లలేదు. ఆ సినిమాను బలవంతంగా కంప్లీట్ చేసి వెంటనే పెండ్లి చేసుకున్నా. చాలా చిన్న వయసులోనే పెండ్లి చేసుకోవడం నా సినీ కెరీర్ కు మైనస్ గా మారిపోయింది. ఇప్పుడు బాగానే అవకాశాలు వస్తున్నాయి అంటూ చెప్పుకొచ్చింది ప్రగతి.
Read Also : Akshay Kumar : ఒకప్పుడు హోటల్ వెయిటర్.. ఇప్పుడు ఇండియా సూపర్ స్టార్.. ఎవరో తెలుసా..?
Read Also : Anushka Shetty : ఆ హీరోతో లిప్ లాక్ ఇష్టంలేదు.. బలవంతంగా చేయించారుః అనుష్క శెట్టి