Actress Pragathi : సినీ ఇండస్ట్రీపై ఎప్పటి నుంచో ఓ అపవాదు ఉంది. ఇక్కడ కాస్టింగ్ కౌచ్, కమిట్ మెంట్లు చాలా ఎక్కువ అని, చాలామంది కొత్తగా వచ్చే వారిని ఇలా వేధిస్తుంటారని ఎంతో మంది ఆరోపిస్తుంటారు. ఇక మీటూ ఉద్యమం తర్వాత చాలామంది ఈ విషయాలను బయటకు చెబుతున్నారు. కొందరు స్టార్ హీరోలపై కూడా ఆరోపణలు చేస్తుంటారు.
మరికొందరు మాత్రం పేర్లు చెప్పకుండా తమ అనుభవాలను పంచుకుంటారు. ఇక తాజాగా నటి ప్రగతి కూడా కాస్టింగ్ కౌచ్ మీద ఓపెన్ కామెంట్లు చేసింది. ఆమె ఇప్పుడు టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తోంది. అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె మాట్లాడుతూ కాస్టింగ్ కౌచ్ మీద ఓపెన్ అయింది.
నటి ప్రగతి మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది లేదని నేను చెప్పను. కానీ ఎప్పుడైనా సక్సెస్ లో ఉన్న వారు కాస్టింగ్ కౌచ్ గురించి స్పందించరు. కానీ అవకాశాలు లేని వారు మాత్రమే ఇలాంటివి చెబుతారు. నిర్మాతలు ఇలాంటి వాటి కోసం కోట్లు ఖర్చు పెట్టరు కదా.
కేవలం 5 నిముషాల సుఖం కోసం హీరోయిన్లపై కోట్లు ఖర్చు పెట్టరు కదా. అక్కడ ఆ పాత్రకు వారు సూట్ అయితేనే వారికి అవకాశం ఇస్తారు అంటూ చెప్పుకొచ్చింది ప్రగతి. ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఆమె కూడా తన అనుభవం చెబితే బాగుండు అంటూ కొందరు ఆకతాయిలు కామెంట్లు పెడుతున్నారు.
Also Read : Devi Sri Prasad : దేవి శ్రీ ప్రసాద్ – హీరోయిన్ ప్రణీత విడిపోవడానికి కారణం ఆయనేనా..?
Also Read : Akhil Akkineni : అఖిల్ ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ కావడానికి ఆ అమ్మాయే కారణమా..?