Actress Prema : సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత ప్రేమలు, డేటింగ్ లు అనేవి చాలా కామన్ అయిపోయాయి. హీరో తమ తోటి హీరోయిన్ లతో ప్రేమాయణం నడిపించడం చాలా కామన్ అయిపోయింది. అయితే ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన ప్రేమ గురించి కూడా అప్పట్లో చాలానే వార్తలు వచ్చాయి.
హీరోయిన్ గా అప్పట్లో ప్రేమకు మంచి క్రేజ్ ఉండేది. ఆమె చేసిన ఎన్నో సినిమాలతో ఆమె మంచి పేరు తెచ్చుకుంది. కొన్ని సినిమాల తర్వాత ఆమెకు అవకాశాలు బాగా తగ్గిపోయాయి. అయితే అప్పుడప్పుడు ఆమె బుల్లితెరపై మాత్రం కనిపిస్తూనే ఉంది. ఇక తాజాగా చాలా కాలం తర్వాత ఆమె ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది.
ఇక అప్పట్లో ప్రేమకు హీరో ఉపేంద్రతో ఎఫైర్ అంటూ వచ్చిన వార్తలపై కూడా స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. అప్పట్లో వార్తలు వచ్చిన మాట వాస్తవమే. కానీ ఎందుకు ఆ వార్తలు వచ్చాయో నాకు తెలియదు. అలా రాసిన వారు ఎన్నడూ నన్ను డైరెక్ట్ గా అడగలేదు. ఉపేంద్ర గారు కూడా ఎప్పుడూ వాటి గురించి నాతో చర్చించలేదు.
నేను కూడా వాటిని ఎన్నడూ సీరియస్ గా తీసుకోలేదు. కానీ మా ఇద్దరి నడుమ ఎలాంటి రిలేషన్ లేదు. ఎక్కువ సినిమాల్లో కలిసి నటించాం కాబట్టే అలా అనుకుని ఉంటారు అంటూ చెప్పుకొచ్చింది ప్రేమ.
Read Also : Venkatesh Daggubati : వెంకటేశ్ కు చాలా ఎఫైర్లు ఉన్నాయి.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..!
Read Also : Sai Dharam Tej : ఆమెతో లవ్ లో పడ్డా.. సాయిధరమ్ తేజ్ ఇన్నాళ్లకు బయట పెట్టాడుగా..!