Actress Raasi : అప్పట్లో హీరోయిన్ గా రాశి ఓ ఊపు ఊపేసింది. చాలా సినిమాల్లో ఆమె ఎంతో చక్కనైన అభినయంతో మెప్పించింది. కానీ ఎందుకో స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో కూడా మెరిసింది. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె సినిమాలకు దూరం అయింది. ఆమెకు ఓ కూతురు కూడా పుట్టింది.
అయితే రాశి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె ఈ నడుమ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. తాజాగా ఆమె ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో ఆమెకు కాస్టింగ్ కౌచ్ మీద ప్రశ్న ఎదురైంది. దానిపై రాశి స్పందిస్తూ సంచలన కామెంట్లు చేసింది. నేను కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పను.
కేవలం సినిమా రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లో ఇది ఉంది. నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే. నాకు సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సరే కాస్టింగ్ కౌచ్ కు గురయ్యాను. కెరీర్ స్టార్టింగ్ లో ఓ తమిళ సినిమాకు కమిట్ అయ్యాను. కానీ ఆ మూవీ నిర్మాత షూటింగ్ లో నాతో మిస్ బిహేశ్ చేశాడు. కానీ నేను పట్టించుకోలేదు.
అతని మేనేజర్ నా వద్దకు వచ్చి.. మీరు ఒంటరిగా ఓసారి సార్ రూమ్ కు వెళ్లాలి.. మీతో మూవీ గురించి మాట్లాడుతారంట అని చెప్పాడు. దాంతో నాకు అనుమానం వచ్చింది. నేను ఆయన రూమ్ కు వెళ్లలేదు. తర్వాత రోజు నిర్మాతను ఇదే విషయంపై ప్రశ్నిస్తే.. నాకు తెలియకుండా ఇదంతా జరిగింది.. సారీ అంటూ చెప్పడంతో వదిలేశాను.
Read Also : Tejaswi Madivada : టాప్ విప్పేసి పడుకోమన్నాడు.. తేజస్వి మదివాడ సంచలన ఆరోపణలు..!
Read Also : Tamannaah Bhatia : తమన్నా పచ్చి బూతులు.. అక్కడ చేయి వేయాలంటూ ఇదేం దారుణం..!