Actress Shakeela : సౌత్ ఇండస్ట్రీలో పోర్న్ స్టార్ అంటే ఒకప్పుడు మాత్రం షకీలా పేరు వినిపించేది. అప్పట్లో ఆమె సినిమాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమె సినిమాలు వస్తున్నాయంటే పెద్ద హీరోల సినిమాలు కూడా వాయిదా పడేవి. ఆ రేంజ్ లో ఆమె క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే షకీలా సినిమాల ద్వారా బాగానే సంపాదించింది.
కానీ అయిన వారే షకీలా ను మోసం చేయడంతో సంపాదించింది మొత్తం కోల్పోయింది. ఇప్పుడు సింగిల్ గానే ఉంటుంది. కానీ ఓ ట్రాన్స్ జెండర్ ను దత్తత తీసుకుని పెంచుకుంటోంది. కాగా ఆమె సినిమాల్లోనే కాదు పర్సనల్ లైప్ లో కూడా బోల్డ్ నెస్ అని నిరూపించు కుంది. ఎందుకంటే ఆమె చాలామందితో ఎఫైర్లు నడిపింది.
ఈ విషయాలను రీసెంట్ గా ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. నేను నా కెరీర్ లో చాలామందితో ప్రేమలో పడ్డాను. ఇప్పటి వరకు ఏడుగురితో డేటింగ్ చేశాను. కానీ ఒకరి తర్వాత ఒకరితో చేశాను. అంతే తప్ప ఒకరితో రిలేషన్ లో ఉండగా మరొకరితో డేటింగ్ చేయలేదు. నేను అందరినీ సిన్సియర్ గా ప్రేమించాను.
కానీ వారంతా నన్ను వాడుకుని వదిలేశారు. ఇప్పుడు నేను నాకంటే చిన్న వయసు వ్యక్తితో డేటింగ్ లో ఉన్నాను. కానీ అతన్ని పెండ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. కేవలం డేటింగ్ మాత్రమే చేస్తాను అని ముందే చెప్పాను. ఇప్పుడు నా కెరీర్ లో నాకు ఎలాంటి బాధలు లేవు అంటూ చెప్పుకొచ్చింది షకీలా.
Read Also : Balagam Movie : బలగం సినిమాకు ఎన్ని కోట్ల లాభం వచ్చిందో తెలుసా.. ఇది కదా జాక్ పాట్..!
Read Also : Sai Pallavi : స్కూల్ డేస్ లోనే ప్రేమలో పడ్డ సాయిపల్లవి.. చితక్కొట్టిన తల్లిదండ్రులు..!