సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఛాన్సులు పట్టడం పెద్ద టాస్క్. ఎంత ట్యాలెంట్ ఉన్నా సరే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. ముఖ్యంగా లేడీస్ అయితే వారికి కాస్టింగ్ కౌచ్ బాధలు అస్సలు తప్పవు. ఇలా కాస్టింగ్ కౌచ్ బారిన పడి ఎంతో మంది జీవితాలను నాశనం చేసుకున్నారు. కొందరు ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోయారు.
అయితే మీటూ ఉద్యమం తర్వాత చాలా మంది దీనిపై స్పందిస్తున్నారు. తాజాగా నటి శిరీష కూడా కాస్టింగ్ కౌచ్ మీద వ్యాఖ్యానించింది. ఆమె దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించింది. కానీ ఎందుకో ఆమెకు పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు. ప్రస్తుతం ఆమెకు సినిమాల్లో అవకాశాలు రావట్లేదు.
అయితే తాజాగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కాస్టింగ్ కౌచ్ అనేది ఓ కామన్ పదం అయిపోయింది. చాలామంది డైరెక్టర్లు, నిర్మాతలు అమ్మాయిలను లొంగదీసుకుంటున్నారు. నేను కూడా అవకాశాల కోసం చాలామందికి కమిట్ మెంట్లు ఇచ్చాను. ఎంతో మంది కోరికలు తీర్చాను.
చాలామంది నిర్మాతల పక్కలో పడుకున్నాను. కానీ వారంతా ఇప్పుడు నన్ను మోసం చేశారు. కనీసం నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు. వారి చేతిలో నేను దారుణంగా మోస పోయాను. అందుకే కమిట్ మెంట్లు ఇవ్వకుండా ఛాన్సులు అందుకోవాలని డిసైడ్ అయ్యాను. ఇండస్ట్రీలో చాలామంది మంచి వారు ఉన్నారు. అలాంటి వారు నాకు అవకాశాలు ఇస్తారని అనుకుంటున్నా అంటూ తెలిపింది శిరీష.