Actress Sudha Spoke About Jr NTR : ఆ హీరోయిన్ కాళ్లు పట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్.. ఎందుకంటే..?

Actress Sudha Spoke About Jr NTR : జూనియర్ ఎన్టీఆర్‌ ఎంత పెద్ద హీరో అయినా సరే ఆయనలో కొంచెం కూడా గర్వం కనిపించదు. ఎంత చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టును అయినా సరే మర్యాదగానే చూస్తూ ఉంటారు. ఇప్పటికే ఆయన గొప్పతనం గురించి ఎంతో మంది చెబుతున్నారు..

By: jyothi

Updated On - Sun - 25 June 23

Actress Sudha Spoke About Jr NTR : ఆ హీరోయిన్ కాళ్లు పట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్.. ఎందుకంటే..?

Actress Sudha Spoke About Jr NTR : జూనియర్ ఎన్టీఆర్‌ ఎంత పెద్ద హీరో అయినా సరే ఆయనలో కొంచెం కూడా గర్వం కనిపించదు. ఎంత చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టును అయినా సరే మర్యాదగానే చూస్తూ ఉంటారు. ఇప్పటికే ఆయన గొప్పతనం గురించి ఎంతో మంది చెబుతున్నారు. ఆయన రూపంలో గానీ, నటనలో గానీ, గుణంలో గానీ అచ్చం సీనియర్ ఎన్టీఆర్‌ లాగే ఉంటారని ఆయన్ను దగ్గరగా చూసిన వారు చెబుతుంటారు.

తాజాగా సీనియర్ నటి సుధ కూడా ఇలాంటి కామెంట్లే చేసింది. సుధ అప్పట్లో హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయింది. ప్రస్తుతం అమ్మ, అత్త, పిన్ని, నానమ్మ ఇలాంటి పాత్రల్లో మెరుస్తోంది. ఆమె తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్‌ ఎలాంటి వాడో ఓ సంఘటన గురించి తెలిపింది.

నేను తారక్ తో కలిసి బాద్షా సినిమాలో నటిస్తున్నప్పుడు ఓ ఇష్యు జరిగింది. సంగీత్ సీన్ లో ఆడవాళ్లందరం స్టేజిపై ఒక్కొక్కరుగా డ్యాన్స్ చేస్తుంటాం. ఆ సీన్ లో నేను డ్యాన్స్ చేస్తున్నప్పుడు సడెన్ గా కాలు స్లిప్ అయి పడిపోయాను. దాంతో ఎన్టీఆర్‌ నా కాళ్లను పట్టుకుని ఏం కాదమ్మా.. పర్లేదు అంటూ పెయిన్ స్ప్రే తెప్పించి కొట్టాడు.

అంత పెద్ద హీరో అయి ఉండి కూడా నాలాంటి క్యారెక్టర్ ఆర్టిస్టు కాళ్లు పట్టుకోవడం చూసి నిజంగా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆయనలో ఇంత కూడా గర్వం లేదు. అందరినీ సమానంగా చూస్తూ ఉంటాడు అంటూ తెలిపింది సుధ. ప్రస్తుతం ఆమె సినిమాల్లో పెద్దగా కనిపించట్లేదు. ఇంటి వద్దనే ఉంటుంది.

Read Also : Samantha Post Viral On Social Media : జీవితాంతం అతన్నే ప్రేమిస్తా… పెళ్లి అయిన హీరోపై సమంత కామెంట్లు..!

Read Also : Nithin Emotional An Interview : యాక్టింగే రాదంటూ నితిన్ చెంప పగలగొట్టిన డైరెక్టర్.. ఎవరో తెలుసా..?

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News