• Telugu News
  • movies

Sunitha : పవన్ కళ్యాణ్ నన్ను వాడుకున్నాడు.. జనసెన ఆఫీస్ వద్ద సునీత హల్చల్..

Sunitha : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు వింటే చాలు ఫ్యాన్స్‌కు పూనకం వస్తుంది. ఆయన సినిమాలు విడుదల అవుతున్నాయంటే వారం ముందు నుంచే అభిమానుల హడావుడి అంతా ఇంతా కాదు..

By: jyothi

Updated On - Mon - 26 September 22

Sunitha : పవన్ కళ్యాణ్ నన్ను వాడుకున్నాడు.. జనసెన ఆఫీస్ వద్ద సునీత హల్చల్..

Sunitha : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు వింటే చాలు ఫ్యాన్స్‌కు పూనకం వస్తుంది. ఆయన సినిమాలు విడుదల అవుతున్నాయంటే వారం ముందు నుంచే అభిమానుల హడావుడి అంతా ఇంతా కాదు. ఆయన పేరు రెండు తెలుగు రాష్ట్రాలో ఒక ప్రభంజనం. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్.. తనకంటూ ఒక ప్రత్యేక మైన ఫ్యాన్ బేస్‌ను ఏర్పాటు చేసుకున్నాడు.

నటి సునీత ఆరోపణలు ఎంతమేర వాస్తవం..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలు చాలా తక్కువే. మెగాస్టార్ 150కు పైగా సినిమాలు చేస్తే ఆయన ఇండస్ట్రీలో టాప్ పొజిషన్‌లో ఉన్నాడు. కానీ పవన్ ఇప్పటివరకు కనీసం హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకోలేదు. కానీ ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే మతిపోతుంది. మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు ఈ విషయాన్ని చాలా సార్లు ప్రస్తావించారు. నాకు వచ్చిన అభిమానులు నా సినిమాలు చూసి వచ్చారు.

కానీ పవన్ అభిమానులు అతని సినిమాల వల్ల రాలేదు. అతని వ్యక్తిత్వం చూసి వచ్చారని చిరు చెప్పుకుంటారు. ఎవరైనా ఆపద, కష్టాల్లో ఉంటే పవన్ సాయం చేయడానికి ముందుంటాడు. తన కష్టార్జితాన్ని ఇతరుల కోసం పంచిపెడుతుంటాడు. ఈ మంచితనమే ఆయనకు అభిమానుల రూపంలో అండగా నిలిచింది. సినిమా హిట్స్, ప్లాప్స్‌తో సంబంధం లేకుండా పవన్ ఫ్యాన్స్ ఎల్లప్పుడూ ఆయన వెంట నడిచేందుకు సిద్ధంగా ఉంటారు.

ఇక ఆడపిల్లలకు అన్యాయం జరిగిందంటే పవన్ కళ్యాణ్ అస్సలు సహించడు. వారికోసం ఎంతదూరమైన వెళ్తాడు. సాయం చేసేందుకు ముందుంటాడు. అలాంటిది పవన్ కళ్యాణ్ నన్ను రాజకీయంగా వాడుకుని మోసం చేశాడని నెల్లూరుకు చెందిన నటి సునీత సంచలన కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తనకు అన్యాయం జరిగిందని.. న్యాయం చేయాలని కోరుతూ తిరుపతి నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర చేపట్టింది. ఈ సందర్భంగా నెల్లూరులోని జనసేన కార్యాలయం వద్ద కాసేపు హల్చల్ చేసింది. బ్యానర్లు కట్టానని, పాంప్లెట్లు పంచి పార్టీకోసం పనిచేస్తే జనసేన నాయకులు నన్ను మోసం చేశారని ఆమె ప్రధానంగా ఆరోపించింది.

Read Also : Rashmi Gautam : వాడుకుని వ‌దిలేస్తార‌ని ముందే తెలుసు.. అందుకే ఇలా చేస్తున్న ర‌ష్మీ..!

Read Also : Disco Shanti: డబ్బులివ్వకుండా శ్రీహరిని ముంచేసారు.. నగలు, కార్లు అమ్మి అప్పులు తీర్చా : డిస్కో శాంతి

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News