Mega Star Chiranjeevi : టాలీవుడ్ లో ఒక చరిత్ర లిఖించింది అతి కొద్ది మంది హీరోలు మాత్రమే. ఒక సునామీ లాంటి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది మాత్రం ఇద్దరు హీరోలే. అందులో ఒకరు సీనియర్ ఎన్టీఆర్ అయితే.. మరొకరు మెగాస్టార్ చిరంజీవి. ఈ ఇద్దరూ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి.. అతిపెద్ద హీరోలుగా ఎదిగారు.
సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో రాణించారు చిరంజీవి. మరి ఇప్పుడు చిరంజీవి తర్వాత ఆ స్థాయిలో రాణించేది ఎవరనే ప్రశ్న అందరిలో ఉంది. ఇప్పుడు స్టార్ హీరోలు బాగా పెరిగిపోయారు. ప్రస్తుతం ఆరుగురి మధ్య పోటీ ఉంది. అందులో పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్.
ఈ ఆరుగురిలో ఎవరికి వారే సాటి. కానీ అందరికంటే ఎక్కువ హిట్లు కొడుతోంది మాత్రం మహేశ్ బాబు, అల్లు అర్జున్. పైగా రీమేక్ సినిమాలు చేయకుండా హిట్లు కొడుతోంది ఈ ఇద్దరే. రాజమౌళి లాంటి డైరెక్టర్ తో సినిమా చేయకపోయినా ఇద్దరూ స్టార్లు అయ్యారు. ఇక కలెక్షన్ల పరంగా ప్రభాస్ ముందు వరుసలో ఉన్నాడు.
తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ లో పవన్ కల్యాన్ ముందు ఉన్నాడు. కానీ నేషనల్ వైడ్ గా చూసుకుంటే ప్రభాస్ కు ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. రామ్ చరణ్ కూడా మంచి లైనప్ తో వస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ చేతిలో కూడా పెద్ద సినిమాలే ఉన్నాయి. కానీ రాబోయే కాలంలో అందరికంటే ప్రభాస్ కే ఎక్కువ మార్కెట్ పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఎందుకంటే ఇప్పటికే ఆయన సినిమాలు నార్త్ లో దుమ్ములేపుతున్నాయి. ఇక సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే లాంటి సినిమాలు ఆయన్ను మరో స్థానంలో నిలుపుతాయని అంటున్నారు. కాబట్టి ఈ జనరేషన్ లో ప్రభాస్ అందరికంటే ముందు వరుసలో ఉంటారని చెబుతున్నారు. చూడాలి మరి ఆయన ఏ స్థాయిలో రాణిస్తాడో.
Read Also : Shruti Haasan : స్నానం చేసేటప్పుడే ఆ పని చేస్తా.. శృతిహాసన్ చెండాలమైన ఆన్సర్..!
Read Also : Jr NTR : ఎన్టీఆర్ తో లవ్ ఎఫైర్ రూమర్లు వచ్చిన ముగ్గురు హీరోయిన్లు వీరే..!