Akkineni Heroes : ఈ నడుమ అక్కినేని హీరోల టైమ్ అస్సలు బాగోలేదు. వరుసగా ప్లాపులు వస్తున్నాయి. అయితే ఇలా ప్లాపులు వస్తున్నప్పుడు ఆచితూచి మాట్లాడాల్సిందిపోయి.. ఏ మాత్రం కవరింగ్ చేయకుండా ఓపెన్ గా మాట్లాడుతున్నారు. దాంతో వారి పరువు మొత్తం వారే తీసుకుంటున్నారు. తాజాగా నాగచైతన్య ఇలాంటి కామెంట్లే చేశాడు.
కస్టడీ ప్రమోషన్ లో ఆయన మాట్లాడుతూ డైరెక్టర్ పరశురామ్ గురించి దారుణంగా మాట్లాడాడు. పరశురాం గురించి మాట్లాడటం వేస్ట్. ఆయన నా టైమ్ అంతా వేస్ట్ చేశాడు. ఆయన గురించి మనం మాట్లాడుకోవడం మన ఇద్దరి టైమ్ వేస్ట్ అంటూ చెప్పాడు. అంతే తప్ప ఆయన గురించి ఇప్పుడెందుకు అని ఒక్క మాటతో సరిపెడితే అయిపోయేది.
ఇక ఏజెంట్ సినిమా ప్రమోషన్ లో అఖిల్ కూడా ఇలాగే మాట్లాడాడు. ప్లాపులు అనేవి చాలా కామన్. అందులో నాకు కూడా భాగం ఉంది. ఎన్ని ప్లాపులు వస్తే అంత బెటర్ అంటూ తన కెరీర్ మీద తానే సెటైర్లు వేసుకున్నాడు ఈ హీరో. ఇక వీరిద్దరి తండ్రి నాగార్జున ఏమైనా తక్కువ తిన్నాడా.
ఆయన కూడా గతంలో ఓ సినిమా హిట్ అయితే.. అసలు ఆ సినిమా ఎలా హిట్ అయిందో నాకే అర్థం కావట్లేదంటూ తన సినిమాపై తానే సెటైర్ వేసుకున్నాడు. ఇక వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో భాయ్ అనే సినిమా డిజాస్టర్ అయింది. ఆ వెంటనే ఓ సందర్భంలో మీడియా ముందు ఓపెన్ గా వీరభద్రమ్ చౌదరిని తిట్టేశాడు నాగ్.
అంతకు ముందు రగడ సినిమా సమయంలో కూడా ఇలాగే అన్నాడు. ఈ సినిమాలో చెత్త డైలాగులు రాయడం వల్లనే మూవీ ప్లాప్ అయిందంటూ తెలిపాడు. ఇలా అక్కినేని హీరోలు కొన్ని పరిస్థితులను కవర్ చేయకుండా ఓపెన్ గా మాట్లాడి తమ పరువు తామే తీసుకుంటున్నారని అంటున్నారు నెటిజన్లు. ఇప్పటికైనా మారాలని చెబుతున్నారు.
Read Also : Vijay Devarakonda : విజయ్ దేవరకొండ హీరో కాకపోతే ఏం అవ్వాలనుకున్నాడో తెలుసా..?
Read Also : Anchor Sreemukhi : ఆ డైరెక్టర్ రూమ్ కు రమ్మన్నాడు.. శ్రీముఖి ఓపెన్ కామెంట్లు..!