Akkineni Naga Chaitanya And Akhil : టాలీవుడ్ లో అక్కినేని కుటుంబం కూడా పెద్ద కుటుంబం అనే చెప్పాలి.. దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు సినిమాలో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు.. ఎన్నో చిత్రాలలో నటించి తెలుగు ఖ్యాతిని పెంచారు.. ఆయన సక్సెస్ తో అక్కినేని కుటుంబం ఒక బ్రాండ్ గా మారిపోయింది. ఆయన వారసుడిగా వచ్చిన నాగార్జున కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను చేసి స్టార్ హీరోగా ఎదిగారు..
అయితే అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున సక్సెస్ అయినంతగా ఆయన మనవాళ్ళు నాగార్జున కొడుకులు సక్సెస్ సాధించలేక పోతున్నారు.. మరి అక్కినేని మనవళ్ల ఫెయిల్యూర్ కు కారణం ఇదేనంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్ సక్సెస్ సాధించలేక వెనుకబడి పోతున్నారు..
వీరు వరుసగా సినిమాలు చేస్తూ సరైన రిలీజ్ డేట్ లను ప్లాన్ చేసుకుని తమ సినిమాలను ఆ తేదీలకు రిలీజ్ అయ్యేలా పాన్ చేసుకుంటున్నారు.. అయితే ఆ సినిమాలు మాత్రం నిరాశ పరుస్తున్నాయి.. వీరు కెరీర్ లో చేసిన చిన్న చిన్న పొరపాట్ల కారణంగానే స్టార్ హీరోలుగా ఎదగలేక పోతున్నారు.. నాగ చైతన్య చేసిన ఒకటి రెండు సినిమాల మినహా మిగతా సినిమాలన్నీ పెద్దగా క్రేజ్ లేని డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడమే చేసాడు.. అందులోను కథ విషయంలో కూడా తడబడడం ఆయన కెరీర్ కు మైనస్ అయ్యింది..
ఇక అఖిల్ పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉంది. ఈయన 30 కోట్లు సాధించిన సినిమా లేదు అనే చెప్పాలి.. ఇప్పుడు ఏజెంట్ 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా కేవలం 35 కోట్ల బిజినెస్ మాత్రమే జరిగింది.. ఈ సినిమా అయిన ఈయనకు బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తుందో లేదో చూడాలి.. ఇలా ఈ ఇద్దరు అన్నదమ్ములు డైరెక్టర్ల విషయంలో కథల విషయంలో చేస్తున్న పొరపాట్ల వల్లనే కెరీర్ ఎదగడం లేదు..
Read Also : Payal Rajput : కోరిక తీర్చమని రూమ్ కు రమ్మన్నాడు.. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్..!
Read Also : Star Heros : టాలీవుడ్ లో రీమేక్ లు చేయని ఇద్దరు స్టార్ హీరోలు వీరే.. గొప్పోళ్లయ్యా..!