Akkineni Naga Chaitanya : అక్కినేని వారసుడు నాగచైతన్య ఇప్పుడు హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది. కానీ ఆయన స్థాయి హిట్ కొట్టి చాలా కాలం అవుతోంది. అక్కినేని ఫ్యామిలీ అంటే టాలీవుడ్ లో టాప్ పొజీషన్ లో ఉంది. అలాంటి ఇంటి నుంచి వచ్చిన హీరో అంటే ఏ స్థాయిలో రాణించాలో అంరదికీ ఓ భారీ అంచనా ఉండేది.
కానీ చైతూ మాత్రం ఆ స్థాయిని అందుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. ఆయనకు ఇండస్ట్రీ హిట్ అనేది అందని కలగానే మిగిలి పోయింది. ఇక రీసెంట్ గా ఆయన నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ అవుతున్నాయి. కానీ ఆయన మాత్రం ముఖం మీద చిరునవ్వును చెదరనివ్వట్లేదు.
ఈ క్రమంలోనే తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రొమాంటిక్ లైఫ్ గురించి స్పదించారు. నేను పెండ్లికి ముందు ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాను. ఆ అమ్మాయితో అప్పట్లో ఓ కారులో ముద్దుపెడుతూ అడ్డంగా పోలీసులకు దొరికిపోయాను.
అప్పుడు పోలీసులు మా వద్దకు రావడాన్ని నేను గమనించలేదు. నాకు పోలీసులంటే భయం వేయలేదు. కానీ నవ్వు వచ్చింది అంటూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చాడు చైతూ. ఆయన చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. సమంత కంటే ముందు చైతూకు కూడా బాగానే లింకులున్నాయే అంటున్నారు సమంత ఫ్యాన్స్.
Read Also : Jr NTR : ఎన్టీఆర్ తో లవ్ ఎఫైర్ రూమర్లు వచ్చిన ముగ్గురు హీరోయిన్లు వీరే..!
:
Read Also : Nidhhi Agerwal : రాత్రి రూమ్ కు పిలిచారు.. నిర్మాత, డైరెక్టర్ పై నిధి అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు..!