Akkineni: అందరిని బండ బూతులు తొట్టె ఆ దర్శకుడికి అక్కినేని ఇచ్చిన అల్టిమేటం

Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు హీరోయిన్లు వచ్చినప్పటికీ ఒకప్పుడు హీరోలు గా వెలుగొందిన ఎన్టీఆ,ర్ నాగేశ్వరరావు లాంటి గొప్ప నటుల గురించి మనం ప్రతిసారి చర్చించుకుంటాం ఎందుకంటే ఎన్టీఆర్, నాగేశ్వరరావు అనేవాళ్ళు తెలుగు సినిమా పరిశ్రమకు రెండు కళ్ళ లాంటి వారు అయితే ఎన్టీఆర్ హీరోగా అప్పట్లో శ్రీ వెంకటేశ్వర మహత్యం అనే సినిమాని పుల్లయ్య తన దర్శకత్వంలో తెరకెక్కించారు ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది అయితే ఈ సినిమాలో ఆర్ట్ డైరెక్టర్ […].

By: jyothi

Published Date - Thu - 26 August 21

Akkineni: అందరిని బండ బూతులు తొట్టె ఆ దర్శకుడికి అక్కినేని ఇచ్చిన అల్టిమేటం

Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు హీరోయిన్లు వచ్చినప్పటికీ ఒకప్పుడు హీరోలు గా వెలుగొందిన ఎన్టీఆ,ర్ నాగేశ్వరరావు లాంటి గొప్ప నటుల గురించి మనం ప్రతిసారి చర్చించుకుంటాం ఎందుకంటే ఎన్టీఆర్, నాగేశ్వరరావు అనేవాళ్ళు తెలుగు సినిమా పరిశ్రమకు రెండు కళ్ళ లాంటి వారు అయితే ఎన్టీఆర్ హీరోగా అప్పట్లో శ్రీ వెంకటేశ్వర మహత్యం అనే సినిమాని పుల్లయ్య తన దర్శకత్వంలో తెరకెక్కించారు ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది అయితే ఈ సినిమాలో ఆర్ట్ డైరెక్టర్ ఎస్ వి ఎస్ రామారావు వేసిన తిరుమల తిరుపతి దేవస్థానం సెట్ అద్భుతంగా వచ్చింది ఈ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా చాలా మంది ప్రజలు ఆ సెట్ ని చూడడానికి వచ్చి అక్కడ దేవుడు బొమ్మలను చూసి వాటికి పూజలు చేస్తూ కానుకలు సమర్పిస్తూ ఉండేవారు ఆ కారణం చేత చాలా కాలం పాటు ఆ సెట్ అలాగే ఉంచారు. అయితే దర్శకుడు పి.పుల్లయ్య ఆ సెట్ ని తీసేసి టైం కు వచ్చిన కానుకలను తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించారు.

పుల్లయ్య తీసిన శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమా బ్లాక్ అండ్ వైట్ లో మంచి విజయాన్ని సాధించిన సినిమాగా గుర్తింపు పొందింది అయితే అదే సినిమాని కొన్ని సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ హీరోగా మళ్లీ కలర్ లో తీయడానికి ఎన్టీఆర్ సిద్ధపడి ఆయనే ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ దర్శకత్వ బాధ్యతలను కూడా ఆయనే స్వీకరించారు అయితే ఈ సినిమా పుల్లయ్య గారు తీసిన శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమా లాగా గొప్పగా ఆడలేదు మామూలుగా ఆడింది అయితే పుల్లయ్య తీసిన సినిమాలో స్పార్క్ అనేది సినిమాలో మిస్సయింది అని చాలా మంది అంటుంటారు ఈ సినిమాలో బాలకృష్ణ నారదుడి వేషం వేశాడు ఇదిలా ఉంటే పుల్లయ్య నాగేశ్వరరావు గారిని మొదటిసారిగా తెలుగు తెరకు పరిచయం చేశారు ఆ తర్వాత ఆయనకు నటనలో కొన్ని మెళకువలు నేర్పి అర్ధాంగి సినిమాలో ఒక మంచి వేషం ఇచ్చారు అయితే నాగేశ్వరరావు పుల్లయ్య ని గురువుగా భావిస్తారు కానీ అప్పుడప్పుడూ పుల్లయ్య నాగేశ్వరరావు గారిని కొన్ని బూతులు తిట్టే వారు దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన నాగేశ్వరరావు అర్ధాంగి సినిమా టైంలో పుల్లయ్య నాగేశ్వరరావు దగ్గరికి వచ్చి

ఈ సినిమాలో నువ్వే చేయాలి అని చెప్పినప్పుడు చేస్తాను కానీ మీరు నన్ను అలా బూతులు తిట్ట కూడదు అని నాకు మాట ఇస్తేనే నేను సినిమాలో చేస్తాను అని అనడంతో పుల్లయ్య పెద్దగా నవ్వి నేను అప్పుడప్పుడు అలాగే తిడుతూ ఉంటాను నేను ఏది మనసులో పెట్టుకొను అవన్నీ వదిలేయాలి నువ్వు కూడా మనసులో నుంచి ఆ ఆలోచనలు తీసేయ్ అని చెప్పి నాగేశ్వరరావును అర్ధాంగి సినిమా షూటింగ్ కి ఒప్పించాడు అయితే ఈ సినిమా ఇద్దరు అన్నదమ్ముల మధ్య నడుస్తుంది దీంతో ప్రధాన పాత్రలో నాగేశ్వరరావు జగ్గయ్య నటించారు అయితే దీంట్లో తమ్ముడి పాత్రని మొదటగా ఈ పాత్రకోసం ఎన్టీఆర్ ని అడిగారు అది నెగిటివ్ రోల్ కావడంతో ఎన్టీఆర్ నేను చేయను అని చెప్పాడు అదే పాత్రని నాగేశ్వరరావుతో చేయించాలి అనుకున్నాడు పుల్లయ్య కానీ నాగేశ్వరరావు కూడా నేను ఆ తమ్ముడు పాత్రను చెయ్యను అన్న పాత్ర అయితే చేస్తాను లేదంటే లేదు అని చెప్పాడు దాంతో పుల్లయ్య నాగేశ్వరరావు చేత అన్న పాత్రలో నటింపచేశాడు ఈ సినిమాలో నాగేశ్వరావుది డి గ్లామర్ రోల్ చేశాడు అయితే సినిమాలో కొద్దిసేపు అలా నటించిన ఆ క్యారెక్టర్ దాని తర్వాత హీరోయిన్ పరిచయం కావడంతో డీసెంట్ గా మారి మంచి లుక్కు లోకి వచ్చే క్యారెక్టర్ కావడంతో నాగేశ్వరరావు సినిమాలో ఆ చేంజ్ ని బాగా చూపించాడు దాంతో సినిమా మంచి విజయం సాధించింది నాగేశ్వరరావు కూడా మంచి పేరు వచ్చింది అయితే దాంట్లో అన్న పాత్రని మాత్రమే చేస్తాను అని పుల్లయ్య తో వాదించటం చూసిన పుల్లయ్య చాలాసార్లు చాలా మంది దగ్గర నాగేశ్వరరావు పాత్రల ఎంపికలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు అని చెప్పేవాడట క్యారెక్టర్ల విషయంలో నాగేశ్వరరావు అస్సలు కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు ఆ కారణం చేతనే ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా చాలాకాలంపాటు కొనసాగాడు…

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News