Alia Bhatt : బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీ బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆమె రీసెంట్ గానే తల్లి అయిన విషయం తెలిసిందే. ఇక బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఆమె తన ఫిజిక్ ను మెయింటేన్ చేస్తోంది. రణ్ బీర్ కపూర్ ను ఆలియాభట్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.
కాగా వీరిద్దరూ పెళ్లికి ముందే చాలా కాలం డేటింగ్ చేశారు. ఇద్దరూ పబ్బులు, పార్టీలు, రెస్టారెంట్లు అంటూ బాగానే తిరిగారు. అయితే పెళ్లి అయిన నెలకే ఆమె ప్రెగ్నెంట్ అయింది. దాంతో వీరిద్దరూ పెళ్లికి ముందే కమిట్ అయ్యారని అంతా కామెంట్లు చేశారు. ఇదే విషయం మీద తాజాగా ఆలియా భట్ స్పందించింది.
ఆమె మాట్లాడుతూ.. అవును రణ్ బీర్ కపూర్ తో నేను నాలుగేండ్లుగా ప్రేమలో ఉన్నా. బాగ్రాలోని ఓ అపార్టుమెంట్ లో మేమిద్దరం కలిసి ఉన్నాం. నాలుగేండ్ల పాటు ఆ ఇంట్లోనే మేం డేటింగ్ చేశాం. ఆ రోజులు మాకెంతో స్పెషల్. మా లైఫ్ ను మేం అర్థం చేసుకునే ఆ రోజులు ఉపయోగపడ్డాయి. మా మధ్య బంధం మరింత పెరిగేలా చేశాయి.
నా దృష్టిలో నాకు పెళ్లి నాలుగేండ్ల క్రితమే అయింది. మనసులు మార్చుకున్న తర్వాత పెళ్లికి అంతకన్నా పవిత్రమైన ఘట్టం ఇంకేముంది. అందుకే మేమిద్దరం అప్పటి నుంచే భార్యా, భర్తలుగా ఉన్నాం అంటూ తెలిపింది ఆలియా భట్. ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Read Also : Vani Bhojan : ఛాన్స్ అడిగితే గెస్ట్ హౌస్ కు రమ్మన్నాడు.. స్టార్ హీరోయిన్ సెన్సేషనల్..!
Read Also : Priyamani : ప్రియమణి-తరుణ్ పెళ్లి చేసుకోకుండా అడ్డుపడ్డ స్టార్ హీరో.. కారణం అదే..!