Allu Aravind : ప్రఖ్యాత కమెడియన్ అల్లు రామలింగయ్య కూతురు సురేఖను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పెళ్లి చేసుకున్నారు. కాగా, పెళ్లి తర్వాత మెగాస్టార్ లైఫ్‌లో చాలా మార్పులొచ్చాయని సినీ వర్గాలు పేర్కొంటుంటాయి. ఈ సంగతి అలా ఉంచితే.. స్టార్ ప్రొడ్యూసర్.. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ – మెగాస్టార్ చిరంజీవిలను కృష్ణార్జులని కొందరు అంటుంటారు. అయితే, ఎవరు అర్జునుడు, ఎవరు కృష్ణుడు అనేది తేలదు. కానీ, వీరి కాంబినేషన్ మాత్రం సూపర్ హిట్ కాంబినేషన్.. వీరి కాంబోలో వచ్చిన సినిమాలు దాదాపుగా సూపర్ హిట్ అయ్యాయి. అవేంటో తెలుసుకుందాం.
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, కళా తపస్వి కె.విశ్వనాథ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘శుభలేఖ’ చిత్రాన్ని అల్లు అరవింద్ , మరో నిర్మాత వి.వి.శాస్త్రీతో కలిసి ప్రొడ్యూస్ చేశారు. ఈ చిత్రానికి ఇళయరాజా మ్యూజిక్ అందించగా, ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇందులో చిరంజీవికి జోడీగా సుమలత నటించింది. అల్లు అరవింద్ సోలో ప్రొడ్యూసర్‌గా చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం ‘యమ కింకరుడు’. ఈ సినిమా సైతం బాక్సాఫీసు వద్ద రికార్డు క్రియేట్ చేసింది.
విజయ బాపినీడు డైరెక్షన్‌లో వచ్చిన ‘హీరో’ సినిమానూ అరవింద్ ప్రొడ్యూస్ చేశారు. అయితే, ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఇకపోతే ఏ.కోదండారామిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ‘విజేత’..భారతీ రాజా దర్శకత్వంలో వచ్చిన ‘ఆరాధన’ అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేశారు. మలయాళంలో మమ్ముట్టి నటించిన ‘పూవిన్ను పుతియ పూంతెన్నెల్’రీమేక్‌గా వచ్చిన ‘పసివాడి ప్రాణం’ తెలుగు ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటినీ తిరగ రాసింది. ఈ సినిమాకు అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ కాగా, ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి రేంజ్‌ను పెంచేసిందని చెప్పొచ్చు.
Allu aravind
‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, ప్రతిబంధ్, రౌడీ అల్లుడు, మెకానిక్ అల్లుడు, ఎస్పీ పరశురాం’ చిత్రాలకు అల్లు అరవింద్ ప్రొడ్యూసర్. ఈ చిత్రాల్లో ‘ఎస్పీ పరశురాం’ ఫిల్మ్ మినహా మిగతా సినిమాలన్నీ బాక్సాఫీసును రఫ్పాడించేశాయి.
pasivadi pranam chiranjeevi
ఇకపోతే జీనియస్ డైరెక్టర్ – యాక్షన్ హీరో అర్జున్ కాంబోలో వచ్చిన ‘జెంటిల్‌మెన్’ సినమా అప్పట్లో సెన్సేషన్ కాగా, ఇదే సినిమాను చిరంజీవి బాలీవుడ్‌లో రీమేక్ చేశారు.
megastar shubhaleksha chiranjeevi
ఈ ఫిల్మ్‌కు అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ కాగా, మహేశ్ భట్ డైరెక్టర్. అయితే, ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు.
pratibandh chiranjeevi
‘మాస్టర్, అన్నయ్య, డాడీ, అందరివాడు’ చిత్రాలనూ అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేశారు. ఇకపోతే సిల్వర్ స్క్రీన్‌పైన చిరంజీవితో అల్లు అరవింద్ ‘మహానగరంలో మాయగాడు, హీరో’ చిత్రాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.