Allu Arjun : టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ బాగా తెలుసు. అల్లు ఫ్యామిలీకి చాలా కాలంగా ఇండస్ట్రీలో అగ్ర తాంబూలం ఉంది. అల్లు అరవింద్ బడా నిర్మాతగా ఉన్నారు. ఇక ఆయన రెండో కొడుకు అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతూ సంచలనాలు సృష్టిస్తున్నాడు.
పుష్ప సినిమా తర్వాత ఆయన మేనియా బాగా పెరిగిపోయింది. ఇక ప్రస్తుతం ఆయన పుష్ప-2 సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు. రీసెంట్ గానే ఆయన బర్త్ డే సందర్భంగా విడుదలైన టీజర్, పోస్టర్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కు సంబంధించిన ఆస్తుల వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆయనకు ప్రైవేట్ జెట్ ఉంది. టాలీవుడ్ లో అతికొద్దిమంది హీరోలకు మాత్రమే ఇది ఉంది. దాంతో పాటు ఆయనకు ప్రత్యేకంగా అన్ని సౌకర్యాలతో కూడిన కారవాన్ ఉంది. దీని ధర రూ.9 కోట్లు. దాంతో పాటు ఆయన వద్ద హమ్మర్ H2 కూడా ఉంది. దీని విలువ రూ. 75 లక్షలు.
అలాగే రేంజ్ రోవర్, వోగ్, బీస్ట్ లాంటి ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి. జాగ్వార్ X JL, వోల్వో XC90 T8, BMW X6 M వంటి ఖరీదైన స్పోర్ట్స్ కార్స్ ఉన్నాయి. వీటితో పాటు ఆయన స్థిర, చర ఆస్తులు కలిపి మొత్తం రూ.350 కోట్లు అని సమాచారం. ఇదంతా ఆయన సినిమాల ద్వారానే సంపాదించినట్టు తెలుస్తోంది. ఆయన తండ్రి వద్ద ఉన్న ఆస్తులు వేల కోట్లలో ఉంటాయని తెలుస్తోంది.
Also Read : Directors : మొదటి సినిమాతోనే రూ100 కోట్ల మార్కు అందుకున్న డైరెక్టర్లు ఎవరో తెలుసా..?
Also Read : Vidyullekha Raman : నన్ను జంతువులతో పోల్చారు.. విద్యుల్లేఖ సంచలన వ్యాఖ్యలు..!