Allu Arvind Sons: అల్లు ఫ్యామిలీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ప్రస్థానం ఉంది. మెగా ఫ్యామిలీ తర్వాత అల్లు కుటుంబంలో కూడా ఇద్దరు హీరోలు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. అందులో ఒకరు సౌతిండియా ఫేమస్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఎంతో కష్టపడి మెగా ఫ్యామిలీతో సంబంధం లేకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అల్లు అర్జున్ కెరీర్ మాత్రం మెగా ఫ్యామిలీ వల్లే సాఫీగా సాగుతోందని అభిమానులు అనుకుంటుంటారు. అందులో కొద్దిగా వాస్తవమున్నా.. అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ కంటే ముందు నుంచే సినిమా ఇండస్ట్రీలో ఉంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య అప్పట్లోనే స్టార్ కమెడియన్..
మెగాస్టార్ చిరంజీవి చిత్ర పరిశ్రమలో ఎదుగుతున్న క్రమంలో తన కూతురు సురేఖను ఇచ్చి వివాహం జరిపించాడు అల్లు రామలింగయ్య. అలా మెగా కుటుంబంతో వీరికి వీడదీయరాని బంధం ఏర్పడింది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్స్‌లో ఒకరైన అల్లు అరవింద్ చిరంజీవికి బావమరిది అవుతాడు. అయితే, మెగాస్టార్ చిరంజీవి, తాతయ్య అల్లు రామలింగయ్య సినిమాలు చూస్తూ పెరిగారు అల్లు హీరోలు.. ముఖ్యంగా అల్లు అర్జున్ మాత్రం చిరు డ్యాన్స్ చూసి స్పూర్తి పొందానని చాలా సార్లు బహిరంగంగా ప్రకటించాడు.
అల్లు అరవింద్ దంపతులకు నలుగురు సంతానమా..?
అల్లు అరవింద్ అనతి కాలంలోనే అద్భుతమైన సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి బడా ప్రొడ్యూసర్లలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. తన భార్య పేరుతో గీతా ఆర్ట్స్ బ్యానర్ ఏర్పాటు చేసి సొంతంగా సినిమాలు నిర్మిస్తున్నారు. ‘మగధీర’ వంటి హిట్ సినిమాలు చేశారు. కాగా అల్లు అరవింద్‌కు ముగ్గురు సంతానం అని ఇప్పటివరకు అంతా భావిస్తున్నారు. బయటి ప్రపంచానికి, అభిమానులకు తెలియని ఇంకొక విషయం ఎంటంటే.. అల్లు అరవింద్ కు నలుగురు సంతానమట.. అల్లు బాబీ, అల్లు అర్జున్, అల్లు శిరీశ్ కాకుండా అల్లు రాజేశ్ కూడా ఉండేవాడట..
బన్నీ కంటే ముందే అల్లు రాజేశ్..
మొన్నటివరకు అల్లు కుటుంబంలో ముగ్గురు వారసులు మాత్రమే అనుకున్నారు. అల్లు రామలింగయ్య నుంచి వచ్చిన ఆస్తి, అల్లు అరవింద్ సంపాదించిన ఆస్తిని మూడు వాటాలు చేసి ఇప్పటికే పంచేసినట్టు బన్నీ తండ్రి ఓసారి ప్రకటించారు. కాకపోతే అతనికి నాలుగో సంతానం కూడా ఉండేదట అతనే అల్లు రాజేశ్.. బన్నీకి , అల్లు బాబీకి మధ్యలో జన్మించాడు. కానీ ఏడేండ్ల వయస్సులో ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదంలో అల్లు రాజేశ్ మరణించాడట.
అప్పటికే అల్లు అర్జున్ కూడా పుట్టాడట.. కానీ చిన్నవాడు. కొడుకు మరణంతో అల్లు అరవింద్ దంపతులు ఎంతో బాధపడ్డారట.. తనకు మూడో కొడుకు కావాలని తన భార్య కోరిక మేరకు అప్పటికే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నా మళ్లీ ప్రత్యామ్నాయ ఆపరేషన్ చేయించి అల్లు శిరీశ్‌కు జన్మనిచ్చారట.. దీంతో చనిపోయిన తన కొడుకు మళ్లీ పుట్టాడని అల్లు అరవింద్ భార్య ఎంతో సంబుర పడిందట..