Allu family : ‘అల్లు’ ఫ్యామిలీ తెలుగు ఇండస్ట్రీకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేనటువంటి పేరు. అల్లు రామలింగయ్య నుంచి అల్లు అర్జున్, అతని తమ్ముడు అల్లు శిరీష్ వరకు అందరూ ఇండస్ట్రీతో అనుబంధం ఉన్న వారే. ఈ ఫ్యామిలీ నుంచి ముందు ఇండస్ట్రీకి వచ్చిన అల్లు రామలింగయ్య.. ఎన్టీఆర్, ఎఎన్నార్ కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఆయా మూవీస్‌లో చేసిన కామెడీ ఇప్పటికీ మనకు గుర్తొస్తూనే ఉంటుంది.
ఇక అల్లు అరవింద్.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్స్‌లో ఈయన ఒకరు. ఈయన నిర్మించిన చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లు కురిపించిన విషయం అందరికీ తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఆయన చిత్రాలు నిర్మిస్తుంటారు. ఆయన నిర్మించిన మగధీర మూవీ.. ఆయన సినీ కెరీర్‌లోనే బెస్ట్‌గా నిలిచింది. ఈ సినిమాతో డైరెక్టర్ రాజమౌళి ఒక్క సారిగా సంచలనం సృష్టించారు. అప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న సినీ రికార్డులన్నింటినీ ఈ మూవీ తిరగరాసింది.
అల్లు అర్జున్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరమే లేదు. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం కొనసాగుతున్న టాప్ హీరోస్‌లో ఆయన ఒకరు. గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన ఈ స్టైలిష్ స్టార్.. అల వైకుంటపురములో సినిమాతో తన కెరీర్‌లోనే అతిపెద్ద హిట్ అందుకున్నాడు. ఇక ఆయన తమ్ముడు అల్లూ శిరీష్ హీరోగా నిలుదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.
Allu family stay away from politics-2
ఈ అల్లు ఫ్యామిలీ సినీ ఇండస్ట్రీలోని రాజకీయాలకు దూరంగా ఉంటున్నదని టాక్. ఇటీవల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎలక్షన్స్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో ప్రకాశ్ రాజ్ ప్యానెల్, మరో వైపు మంచు విష్ణు ప్యానెల్ పోటీలోకి దిగారు. ప్రకాశ్ రాజ్ కు మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఇక విష్ణు ప్యానెల్‌కు సీనియర్ హీరోలు కృష్ణం రాజు, బాలకృష్ణ అండగా ఉన్నారు. ఈ ఎలక్షన్స్ వల్ల తెలుగు సినీ ఇండస్ట్రీలో వివాదాలు, విమర్శలు, విభేదాలు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంలోనూ అల్లు ఫ్యామిలీ ఎలాంటి వివాదాలకు తావివ్వలేదు. ఆ ఫ్యామిలీలో ఎవరూ దీనిపై స్పందించలేదు. అల్లు అర్జున్ సైతం ఈ ఎలక్షన్స్‌లో ఓటు వేయలేదు.
ఇక మా ఎలక్షన్స్ సమయంలో నాగబాబు, తర్వాత పవన్ కల్యాణ్ అనేక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇండస్ట్రీలో రాజకీయ దుమారం రేగింది. ఎలక్షన్స్‌లో అవకతవకలు జరిగాయంటూ ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిపొందిన వారు వారి పదవులకు రిజైన్ చేశారు. ఇలా ఇండస్ట్రీలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్న అల్లు ఫ్యామిలీ మొదటి నుంచి వాటికి దూరంగానే ఉంటుంది. మా ఎలక్షన్స్ టైంలోనే కాదు అంతకు ముందు తలెత్తిన పలు వివాదాల్లోనూ ఈ ఫ్యామిలీ దూరంగా ఉండటం గమనార్హం. ఎలాంటి వివాదాల్లో, రాజకీయాల్లో తలదూర్చని అల్లు ఫ్యామిలీని వారి ఫ్యాన్స్ సైతం సపోర్ట్ చేస్తున్నారు.