Allu Ramalingaiah : అల్లు రామలింగయ్య అంటే లెజెండ్ యాక్టర్ అని అందరూ చెప్పేస్తారు. అప్పట్లో కమెడియన్ అనే పదానికి గుర్తింపు తీసుకువచ్చిందే ఆయన. ఆయన తర్వాత నుంచే కామెడీకి ఎక్కువగా సినిమాల్లో స్కోప్ ఇస్తూ వచ్చారు. అలాంటి రామలింగయ్య వల్ల కూడా కొందరు డైరెక్టర్లు ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఉన్నాయి.
కానీ కొందరు మాత్రమే వాటిని పైకి చెప్పారు. అలాంటి వారిలో విజయ నిర్మల కూడా ఒక్కరు. హీరోయిన్ గా విజయ నిర్మల దాదాపు 200లకు పైగా సినిమాల్లో నటించింది. అప్పట్లో స్టార్ గా ఓ వెలుగు వెలిగింది. ఇక దర్శకురాలిగా మారి దాదాపు 44 సినిమాలను తెరకెక్కించింది. ఆ తర్వాత కృష్ణను రెండో పెండ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. 2019లో అనారోగ్యంతో చనిపోయింది.
అయితే ఆమె బతికి ఉన్నప్పుడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. మీరు డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఎవరితో అయినా ఇబ్బంది పడి షూటింగ్ క్యాన్సిల్ చేశారా అని యాంకర్ ప్రశ్న వేసింది. దానికి ఆమె స్పందిస్తూ.. నా కెరీర్ లో అలాంటి పరిస్థితులు పెద్దగా ఎదురుకాలేదు. కానీ కోట శ్రీనివాస్ గారితో, అల్లు రామలింగయ్య గారితో ఇబ్బంది పడ్డాను.
ఓ సారి అల్లు రామలింగయ్య గారు షూటింగ్ కు తాగేసి వచ్చారు. నేను సీన్ పేపర్స్ వివరిస్తుంటే ఆయన నవ్వుతున్నారు. ఆయనకు తాగిన మైకంలో ఏం అర్థం కావట్లేదు. దాంతో నాకు కోపం వచ్చింది. ఈరోజు మీరు వెళ్లిపోండి రేపే మీతో సీన్ చేస్తాను అని చెప్పి పంపించేశాను. తర్వాత రోజు ఆయనకు మళ్లీ తాగిరావొద్దని చెప్పాను. అప్పటి నుంచి ఆయన నా షూటింగ్ కు తాగి రాలేదు అని చెప్పింది విజయ నిర్మల.
Read Also : Chiranjeevi : శరత్ బాబు హీరోగా, చిరంజీవి విలన్ గా నటించిన మూవీ ఏదో తెలుసా..?
Read Also : Sri Reddy : ఏంటీ.. శ్రీరెడ్డికి ఇంత పెద్ద కూతురు ఉందా.. ఇన్నాళ్లకు బయట పడ్డ నిజం..!