Allu Ramalingaiah : నటీనటులు సినిమాలోని తమ పాత్ర ప్రకారం నటిస్తుండటం మనం చూస్తుంటాం. చిత్రంలో ఒకవేళ వైద్యుడి పాత్ర పోషించాల్సి వస్తే వారు మెడలో స్టెతస్కోప్ వేసుకుని కనబడుతుంటారు. దర్శకుడి సూచన మేరకు డాక్టర్ బాడీ లాంగ్వేజ్ వెండితెరమీద కనబడేలా యాక్ట్ చేస్తుంటారు. అయితే, నిజజీవితంలో డాక్టర్ అయి తెర మీద యాక్టర్ అయిన వారు కూడా చాలా మందే ఉన్నారు. అటువంటి నటీనటులెవరో తెలుసుకుందాం..
చాలా మంది నటీనటులు తాము డాక్టర్ కాబోయి యాక్ట్ అయామని అంటుంటారు. కానీ, వీరు మాత్రం నిజజీవితంలో డాక్టర్ అయిన తర్వాతే అవకాశాలు వచ్చి యాక్టర్‌గా మారారు. ఈ నటీనటులకు మరో అడ్వాంటేజ్ కూడా ఉంది. అదేంటంటే.. ఒకవేళ మూవీస్‌లో ఆఫర్స్ రాకపోతే ఎంచక్కా వైద్య వృత్తిని కొనసాగించొచ్చు. ఇక రియల్ లైఫ్‌లో స్టెతస్కోప్ పట్టుకుని వైద్యం చేసిన వీరికి రీల్ లైఫ్‌లో అనగా యాక్టింగ్‌లో వైద్యులుగా నటించడం చాలా ఈజీ అవుతుంది.
Madala Ravi
దివంగత నటుడు అల్లు రామలింగయ్య ఈ కోవకు చెందిన వారే. ఆయుర్వేదంలో పట్టున్న వ్యక్తిగా, హోమియో వైద్యుడిగా పేరుగాంచిన అల్లు రామలింగయ్య.. ఆ తర్వాత కాలంలో వెండితెరపై కమెడియన్‌గా రాణించారు. కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకుని అల్లు రామలింగయ్య వెండితెరను కొన్నేళ్ల పాటు ఏలాడని చెప్పొచ్చు. పద్మశ్రీ అల్లు రామలింగయ్య ఆంధ్రప్రదేశ్‌లోని పాలకొల్లు ప్రాంతానికి చెందిన వారు కాగా, ఈయన సుమారు వెయ్యి తెలుగు చిత్రాల్లో నటించడం విశేషం.
Allu Ramalingaiah
మందాడి ప్రభాకరరెడ్డి ఈయన నేటి తరం ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, నాడు ఈయన సుప్రసిద్ధ నటుడు. విలన్‌గా పలు చిత్రాల్లో నటించిన ప్రభాకరరెడ్డి..ప్రొడ్యూసర్‌గా, డైరెక్టర్‌గా పలు సినిమాలు తెరకెక్కించారు. ఏఎన్ఆర్, ఎన్టీఆర్, చిరంజీవి నటించిన పలు మూవీస్‌లో ప్రభాకరరెడ్డి విలన్ రోల్స్ ప్లే చేశాడు. నటుడిగా 470కి పైగా సినిమాల్లో నటించిన ప్రభాకరరెడ్డి కూడా వృత్తిరిత్యా వైద్యుడు. ప్రభాకరరెడ్డికి వైద్యుడిగానూ మంచి పేరుండటం గమనార్హం.
M. Prabhakar Reddy 1
ఎక్కువ శాతం విప్లవానికి సంబంధించిన సినిమాల్లోనే నటించిన విప్లవ కథనాయకుడు మాదాల రంగారావు తనయుడు మాదాల రవి కూడా ప్రొఫెషన్ రిత్యా డాక్టరే. డాక్టర్ చదువు చదివిన తర్వాతనే ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మాదాల రవి ప్రజెంట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ప్యానెల్ సభ్యుడిగా ఉన్నారు. ఆ తరం వారు మాత్రమే కాదు ఈ తరానికి సంబంధించిన నటీనటులలో కూడా కొందరు డాక్టర్ ప్రొఫెషన్ నుంచి యాక్టింగ్ ప్రొఫెషన్‌లోకి వచ్చారు. రాజశేఖర్, సాయిపల్లవి, భరత్‌రెడ్డి, రూప కొడవయూర్, నటాషాదోషి ఇంకా చాలా మంది ఉన్నారు.