Directors Special Heroines : ఈ హీరోయిన్లకు ఆ దర్శకులంటే అంత స్పెషల్ ఎందుకంటే..

Directors Special Heroines : కొంతమంది దర్శకులు కొందరు హీరోయిన్లకు బాగా కనెక్ట్ అవుతారు. అదే సమయంలో కొంతమంది హీరోయిన్లు, కొంతమంది దర్శకులకు ఇంకా బాగా కనెక్ట్ అయిపోతారు. ఇందులో పెడార్థాలు తీయడానికేమీ లేదు. ఆయా దర్శకులతో హిట్లు కొట్టిన హీరోయిన్లు, ఆయా హీరోయిన్లతో సక్సెస్ కొట్టిన డైరెక్టర్లు.. ఇలా వారిని ‘స్పెషల్’గా ట్రీట్ చేయడం మామూలే. పైగా, అలా కనెక్ట్ అయితే.. సన్నివేశాల్ని వివరించే క్రమంలో, సన్నివేశం గురించి తెలుసుకునే క్రమంలో ఇద్దరికీ కంఫర్ట్ లెవల్స్ […].

By: jyothi

Published Date - Fri - 26 November 21

Directors Special Heroines : ఈ హీరోయిన్లకు ఆ దర్శకులంటే అంత స్పెషల్ ఎందుకంటే..

Directors Special Heroines : కొంతమంది దర్శకులు కొందరు హీరోయిన్లకు బాగా కనెక్ట్ అవుతారు. అదే సమయంలో కొంతమంది హీరోయిన్లు, కొంతమంది దర్శకులకు ఇంకా బాగా కనెక్ట్ అయిపోతారు. ఇందులో పెడార్థాలు తీయడానికేమీ లేదు. ఆయా దర్శకులతో హిట్లు కొట్టిన హీరోయిన్లు, ఆయా హీరోయిన్లతో సక్సెస్ కొట్టిన డైరెక్టర్లు.. ఇలా వారిని ‘స్పెషల్’గా ట్రీట్ చేయడం మామూలే. పైగా, అలా కనెక్ట్ అయితే.. సన్నివేశాల్ని వివరించే క్రమంలో, సన్నివేశం గురించి తెలుసుకునే క్రమంలో ఇద్దరికీ కంఫర్ట్ లెవల్స్ బావుంటాయి. మంచి ప్రోడక్ట్ బయటకు వస్తుంటుంది అలాంటి కాంబినేష్ల నుంచి. కానీ, ఇలాంటి కాంబినేషన్ల చుట్టూ బోల్డన్ని రూమర్స్ కూడా వస్తుంటాయండోయ్. సినీ పరిశ్రమలో రూమర్లు లేకుండా ఏదీ సాధ్యం కాదు గనుక, దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటారు చాలామంది.


పూరీ జగన్నాధ్ – ఛార్మి

Directors Special Heroines : puri jagannath with charmme

Directors Special Heroines : puri jagannath with charmme


’జ్యోతిలక్ష్మి‘ సినిమా కోసం ఛార్మిని హీరోయిన్ గా తీసుకున్నాడు పూరీ జగన్నాధ్. అప్పటికే ఛార్మి స్టార్ హీరోయిన్. ’జ్యోతిలక్ష్మి‘తో స్టార్ట్ అయిన వీరిద్దరి కాంబినేషన్ ఇప్పటి వరకూ కంటిన్యూ అవుతూనే ఉంది. పూరీ కనెక్ట్స్ పేరుతో సంయుక్తంగా ఓ నిర్మాణ సంస్థను రన్ చేస్తున్నారు వీరిద్దరూ. విజయ్ దేవరకొండ హీరోగా ’లైగర్‘ చిత్రం పూరీ కనెక్ట్స్ బ్యానర్లో రూపొందుతోన్న సంగతి తెలిసిందే.


త్రివిక్రమ్ శ్రీనివాస్ – పూజా హెగ్దే

Directors Special Heroines : trivikram srinivas with pooja hegde

Directors Special Heroines : trivikram srinivas with pooja hegde


’అరవింద సమేత‘ చిత్రంతో వీరిద్దరి కాంబినేషన్ స్టార్ట్ అయ్యింది. సక్సెస్ అయ్యింది. అదే సెంటిమెంట్ గా తన తదుపరి చిత్రం ’అల వైకుంఠపురములో‘ నూ పూజా హెగ్దేను హీరోయిన్ గా కొనసాగించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

Directors Special Heroines : trivikram srinivas with pooja hegde

Directors Special Heroines : trivikram srinivas with pooja hegde


వెంకీ కుడుముల – రష్మికా మండన్న

Directors Special Heroines : venky kudumula with rashmika

Directors Special Heroines : venky kudumula with rashmika


’ఛలో‘ సినిమాతో కన్నడ కుట్టి రష్మిక మండన్నాని టాలీవుడ్ కి పరిచయం చేశాడు దర్శకుడు వెంకీ కుడుముల. డైరెక్టర్ గా వెంకీ కుడుములకూ ఇదే తొలి సినిమా. ఇద్దరికీ ఈ సినిమా మంచి బిగినింగ్ ఇచ్చింది. వెంకీ తన తదుపరి చిత్రం ’భీష్మ‘లోనూ రష్మికనే హీరోయిన్ గా తీసుకుని ద్వితీయ విఘ్నాన్ని కూడా జయించేశాడు. లాక్డౌన్ కి కొన్ని రోజుల ముందే విడుదలై ’భీష్మ‘ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అంతవరకూ ఫెయిల్యూర్స్ లో ఉన్న నితిన్ కి బంపర్ హిట్ అందించింది.


శేఖర్ కమ్ముల – సాయి పల్లవి

Directors Special Heroines : Shekarkamula with sai pallavi

Directors Special Heroines : Shekarkamula with sai pallavi


విలక్షణ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల వరుస ఫెయిల్యూర్స్ తర్వాత ’ఫిదా‘ సినిమాతో హిట్ కొట్టాడు. ’ఫిదా‘తో హైబ్రీడ్ పిల్ల సాయిపల్లవిని టాలీవుడ్ కి పరిచయం చేశాడు. ఆ సక్సెస్ సెంటిమెంట్ తో తదుపరి చిత్రం ’లవ్ స్టోరీ‘లోనూ సాయి పల్లవినే హీరోయిన్ గా కంటిన్యూ చేస్తున్నాడు. పరిస్థితులు అనుకూలంగా ఉంటే, ఏప్రిల్ లో ఈ సినిమా ధియేటర్ లో సందడి చేసి ఉండేది.


సంపత్ నంది – తమన్నా

Directors Special Heroines : sampath nandi with tamannah

Directors Special Heroines : sampath nandi with tamannah


తమన్నా – సంపత్ నంది నిజంగానే స్పెషల్ కాంబో. ‘రచ్చ’, బెంగాల్ టైగర్’ సినిమాల తర్వాత తాజాగా ఈ ఇద్దరి కాంబోలో ‘సీటీమార్’ సినిమా రాబోతోంది. తమన్నాతో కంఫర్ట్ లెవల్స్ బావుంటాయని చెబుతుంటాడు దర్శకుడు సంపత్ నంది. తమన్నా కూడా ఇదే అభిప్రాయాన్ని పలు సందర్భాల్లో వ్యక్తం చేసింది.


అనిల్ రావిపూడి – మెహ్రీన్

Directors Special Heroines : Mehreen Pirzada with Director Anil Ravipudi

Directors Special Heroines : Mehreen Pirzada with Director Anil Ravipudi


బ్యాక్ టు బ్యాక్ సక్సెస్సుల నేపథ్యంలోనే ఈ కాంబినేషన్ గురించిన చర్చ జరుగుతుంటుంది. ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్2’ సినిమాలు ఈ కాంబోలో వచ్చి విజయవంతమయ్యాయి. ‘ఎప్2’ సీక్వెల్ ‘ఎఫ్3’ గనుక, మెహరీన్ ఇంకోసారి అనిల్ రావిపూడి సినిమాలో రిపీటవుతోందంతే. ‘హనీ ఈజ్ ది బెస్ట్’ అనే డైలాగ్ వల్ల తన పాపులారిటీ పెరిగిందనీ, దానికి కారణమైన అనిల్ రావిపూడికి ఎప్పటికీ రుణపడి వుంటానంటోంది మెహరీర్.


తేజ – కాజల్ అగర్వాల్

Directors Special Heroines : Teja with Kajal Agarwal

Directors Special Heroines : Teja with Kajal Agarwal


’లక్ష్మీ కళ్యాణం‘ సినిమాతో కాజల్ అగర్వాల్ ని టాలీవుడ్ కి పరిచయం చేశాడు డైరెక్టర్ తేజ. టాలీవుడ్ చందమామగా స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుని, నెంబర్ వన్ హీరోయిన్ రేంజ్ అందుకుంది కాజల్ అగర్వాల్. హీరోయిన్ గా స్టార్ డమ్ దక్కించుకున్నప్పటికీ, తేజ అడగ్గానే ’నేనే రాజు నేనే మంత్రి‘ సినిమాలో రానాకి జోడీగా నటించి, డైరెక్టర్ తేజకి సక్సెస్ అందించింది కాజల్. ఆ తర్వాత తేజ డైరెక్షన్లోనే ’సీత‘ సినిమా కోసం హీరోయిన్గా డిఫరెంట్ అవతారమెత్తింది కాజల్ అగర్వాల్. అంతేకాదు, ఇప్పటికీ, ఎప్పటికీ తేజ అడగాలే కానీ, తేజ కోసం సినిమా చేయడానికి సిద్ధంగా ఉంటానని కాజల్ చెబుతుంటుంది.
ఇలాంటి కాంబినేషన్లను చాలానే చూశాం, చూస్తున్నాం, ఇకపైనా చూస్తాం. ఇక్కడ కాంబినేషన్లకు వున్న క్రేజ్ అలాంటిది మరి.

Tags

Latest News

Related News