Anasuya Bharadwaj : సినిమా ఇండస్ట్రీ అనేది పైకి చూడటానికి రంగుల ప్రపంచం లాగే ఉంటుంది. కానీ లోపల మాత్రం అనేక లొసుగులు ఉంటాయి. ఆ విషయం కొందరికి మాత్రమే తెలుసు. ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు రావాలంటే మాత్రం కమిట్ మెంట్ ఇవ్వాల్సిందే అన్నట్టు పరిస్థితులు తయారైపోయాయి.
ఈ విషయం మీద ఎంతో మంది స్పందిస్తూనే ఉంటారు. కొందరు తమకు జరిగిన అనుభవాలను పంచుకుంటారు. తాజాగా హాట్ యాంకర్ అనసూయ కూడా ఈ విషయం మీద స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలోనే కాదు అన్ని రంగాల్లో కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది.
కానీ సినిమా రంగంలో కాస్త ఎక్కువగా ఉంది. మన టాలీవుల్ లో కూడా ఈ నడుమ ఎక్కువగా ఈ మాట వినిపిస్తోంది. నేను కూడా కాస్టింగ్ కౌచ్ కు గురయ్యాను. అప్పట్లో నన్ను కూడా కొందరు కోరిక తీర్చమంటూ వేధించారు. కానీ నేను ఒప్పుకోలేదు. దాంతో రెండేండ్లు ఛాన్సులు రాలేదు నాకు.
కానీ నేను మాత్రం ట్యాలెంట్ తోనే అవకాశాలు అందుకున్నాను. ఒక స్టార్ డమ్ వచ్చిన తర్వాత ఇలాంటివి ఎదురు కావు. అప్పుడు ఆటోమేటిక్ గా ఛాన్సులు వస్తాయి అంటూ తెలిపింది అనసూయ. ఆమె ఇప్పుడు బుల్లితెరపై కనిపించట్లేదు. కానీ వెండితెరపై మాత్రం ఆమెకు బాగానే ఛాన్సులు వస్తున్నాయి.
Read Also : Akhil Akkineni : ఆ హీరోయిన్ ను లైంగికంగా వేధించిన అఖిల్.. సంచలన మ్యాటర్ లీక్..!
Read Also : Akkineni Naga Chaitanya : సమంత కంటే ముందే స్టార్ హీరో కూతురును ప్రేమించిన చైతూ.. ఎవరామె..?