Anchor: బుల్లితెరపైనా, వెండితెరపైనా హాటుగా, ఘాటుగా రెచ్చిపోయింది వీళ్ళే

Anchor : బుల్లితెరపైనా, వెండితెరపైనా హాటుగా, ఘాటుగా రెచ్చిపోయింది వీళ్ళే గ్లామరస్ ప్రపంచంలో అందాల ప్రదర్శనే అందాల భామలకు అతి పెద్ద పెట్టుబడి. తద్వారా అవకాశాల్ని కొల్లగొట్టిన అందాల భామలు ఎందరో వున్నారు. అయితే, అటు వెండితెరపైనా, ఇటు బుల్లితెరపైనా రెచ్చిపోయి, సంచలనాలకు కేంద్ర బిందువులుగా మారింది కొందరే. అలాగని అందరికీ ఆ అందాల ప్రదర్శన కలిసొచ్చేయలేదు. కొందరికి మాత్రం, ఆ గ్లామర్ చాలా చాలా చాలా బాగా కలిసొచ్చేసింది. బుల్లితెరపై తమ అంద చందాలతో కిర్రాకు […].

By: jyothi

Updated On - Sun - 14 November 21

Anchor: బుల్లితెరపైనా, వెండితెరపైనా హాటుగా, ఘాటుగా రెచ్చిపోయింది వీళ్ళే

Anchor : బుల్లితెరపైనా, వెండితెరపైనా హాటుగా, ఘాటుగా రెచ్చిపోయింది వీళ్ళే గ్లామరస్ ప్రపంచంలో అందాల ప్రదర్శనే అందాల భామలకు అతి పెద్ద పెట్టుబడి. తద్వారా అవకాశాల్ని కొల్లగొట్టిన అందాల భామలు ఎందరో వున్నారు. అయితే, అటు వెండితెరపైనా, ఇటు బుల్లితెరపైనా రెచ్చిపోయి, సంచలనాలకు కేంద్ర బిందువులుగా మారింది కొందరే. అలాగని అందరికీ ఆ అందాల ప్రదర్శన కలిసొచ్చేయలేదు. కొందరికి మాత్రం, ఆ గ్లామర్ చాలా చాలా చాలా బాగా కలిసొచ్చేసింది. బుల్లితెరపై తమ అంద చందాలతో కిర్రాకు పుట్టించి, ఆ తర్వాత వెండితెరపై అంతకు మించిన అందాల ప్రదర్శన చేసినవారెందరో వున్నారు. కొందరు ఫెయిలయ్యారు కూడా. హిట్టుకొట్టినోళ్ళు, ఫట్టుమన్నోళ్ళు ఎవరో చూసేద్దామా మరి.?

అనసూయ భరద్వాజ్:

Anchor Anasuya Bharadwaj

Anchor Anasuya Bharadwaj

పరిచయం అక్కర్లేని పేరిది. న్యూస్ రీడర్, సినిమాల్లో చిన్న పాత్రలు, ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్ యాంకర్.. ఇలా రకరకాలుగా ప్రయత్నించి, జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయ్యింది అనసూయ. పెళ్ళయ్యింది, పిల్లలున్నారు.. అయినా, అనసూయ బుల్లితెరపై స్కిన్ షో విషయంలో ఏనాడూ రాజీ పడలేదు. ఎవరన్నా ఏమన్నా అనుకోండి, అంతా నా ఇష్టం.. అన్నట్టు చెలరేగిపోయింది. వెండితెరపై అప్పుడప్పుడూ మాత్రమే సొగసుల వడ్డింపు చేసే అనసూయ, ఈ కోవలో హయ్యస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ అనుకోవచ్చేమో. అంటే, బుల్లితెరపైనా, వెండితెరపైనా అదరగొడుతున్న సంపాదన లిస్టులో.

రష్ష్మి:ఇక్కడ ఘాటుగా, అక్కడ మరింత హాటుగా

Anchor Rashmi Gautam

Anchor Rashmi Gautam

అనసూయ కంటే ముందు స్టార్ డమ్ సంపాదించుకుంది బుల్లితెర ద్వారా రష్మి గౌతమ్. వెండితెరపైనా మరింత చెలరేగిపోయింది. కానీ, ఎందుకో వెండితెర రష్మికి అంతగా కిక్ ఇవ్వలేకపోయింది. ఏమో, ప్రస్తుతానికైతే ఇదీ పరిస్థితి. రేప్పొద్దున్న అనూహ్యమైన స్టార్ డమ్ రష్మికి వెండితెరపై వచ్చేసినా ఆశ్చర్యమేముంది? ఇక, బుల్లితెరపైన అయితే రష్మికి పోటీనే లేదు. ఏ షో చేసినా, అది హిట్టే. ప్రధానంగా రష్మిక కాస్ట్యూమ్స్, స్టైలింగ్, డాన్సులు టూ మచ్ హాట్.

శ్రీముఖి: బుల్లితెరపై హాట్ రాములమ్మ శ్రీముఖి

Anchor sreemukhi

Anchor sreemukhi

అనసూయ, రష్మి తర్వాత బుల్లితెరపై విపరీతమైన ఫాలోయింగ్ వున్నది శ్రీముఖికే. అడపా దడపా సినిమాల్లో నటిస్తూ, బుల్లితెరపై సందడి చేసే శ్రీముఖి హవా అప్పుడప్పుడూ తగ్గుతుంటుంది, అంతలోనే పైకి ఎగబాకుతూ వుంటుంది. బుల్లితెర రాములమ్మగా శ్రీముఖికి వున్న పేరు ప్రఖ్యాతుల గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఓ సీజన్ బిగ్ బాస్ రియాల్టీ షో కేవలం శ్రీముఖి కారణంగానే అత్యధికంగా వ్యూయర్స్ సాధించిందనడం అతిశయోక్తి కాకపోవచ్చు. కానీ, అనూహ్యంగా టైటిల్ వేటలో వెనకబడిందామె.

విష్ణుప్రియ: డాన్సింగ్ సెన్సేషన్  

Anchor Vishnupriya

Anchor Vishnupriya

విష్ణుప్రియ గురించి మాట్లాడుకోవాలంటే, ముందుగా ఆమె ముక్కు గురించి ప్రస్తవించుకోవాలేమో. అంతగా ఆమె ముక్కుని టార్గెట్ చేసి పలు షోలలో సెటైర్లు వేశారు చాలామంది. అయితే, ఆమె చాలామంచి డాన్సర్. ఆ విషయం పలు సందర్భాల్లో విష్ణు ప్రియ నిరూపించుకుంది. హాట్ అప్పీల్ విషయంలో తాను హీరోయిన్లకు తక్కేవేమీ కాదని పలు ఫొటో సెషన్లతో ప్రూవ్ చేసింది.

వర్షిణి: కనిపిస్తే, గ్లామర్ వర్షమే

Anchor varshini

Anchor varshini

వర్షిణి సౌందర రాజన్ కూడా, బుల్లితెరపై దుమ్ము రేపేస్తోంది. అనూహ్యంగా ఈమెకీ స్టార్ డమ్ వచ్చిపడింది. పలు షోలతో బుల్లితెరపై హాటు హాటుగా హొయలొలికించేస్తోన్న ఈ ముద్దగుమ్మ, వెండితెరపై సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.
ఒకప్పుడు ఉదయభాను బుల్లితెరను ఓ ఊపు ఊపేసింది. ఈ తరంలో పైన పేర్కొన్నవారితోపాటు, వర్ష, దీపిక పల్లి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో కన్పిస్తారు. ముంబై భామల్ని మించి మన తెలుగు నేల మీదనే ఎందరో అందాల భామలు అటు వెండితెరపైనా, ఇటు బుల్లితెరపైనా తమ సొగసుల్ని, సోయగాల్నీ ఆరబోసేస్తూ, ఔత్సాహిక ప్రేక్షకుల గుండెల్ని కొల్లగొట్టేస్తున్నారు.

Tags

Latest News

Related News