Anchor Sreemukhi Dating A Star Hero Is Favorite : శ్రీముఖి అంటే తెలుగు బుల్లితెరపై ఇప్పుడు ఓ సెన్సేషన్. అగ్ర యాంకర్ గా మారిపోయింది. అన్ని ఛానెళ్లు చుట్టేస్తూ వరుసగా ప్రోగ్రామ్స్ చేస్తూ గడిపేస్తోంది ఈ భామ. ఒక రకంగా చెప్పాలంటే ఆమె చేస్తున్నన్ని షోలు ఇంకెవరూ చేయట్లేదనే చెప్పుకోవాలి. చాలా షోలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
కాగా శ్రీముఖి గతంలో ఓ షోలో చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసార వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా ఆమె చేసిన ప్రోగ్రామ్ కు బుల్లితెర సీరియల్స్ రియల్ కపుల్స్ వచ్చారు. ఇందులో నీకు పెళ్లి వద్దా అని శ్రీముఖిని ఫైమా అడుగుతుంది. ఇప్పుడు మనకు ఏ హీరో సెట్ అవుతాడు అని అడుగుతుంది శ్రీముఖి.
Anchor Sreemukhi Dating A Star Hero Is Favorite
ఫైమా మాట్లాడుతూ.. ప్రభాస్ ఒక్కడే సింగిల్ గా ఉన్నాడు అని చెబుతుంది. ఆ హీరో అయితే పెళ్లికి ముందే ఒక్కరోజు డేటింగ్ ఛాన్స్ వచ్చినా నను రెడీ అంటూ చెప్పింది శ్రీముఖి. ఎక్కడా కలలోనా అంటూ కౌంటర్ వేసింది ఫైమా. దెబ్బకు శ్రీముఖి ముఖం వాడిపోయింది. ప్రోగ్రామ్ లో నవ్వులు పూశాయి.
గతంలో కూడా తన ఫేవరెట్ హీరో ప్రభాస్ అని ఎన్నోసార్లు చెప్పింది శ్రీముఖి. ఇక శ్రీముఖి పెళ్లి అంటూ ఎన్నో వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఆమె వాటిపై పెద్దగా స్పందించట్లేదు. ఆమె వయసు కూడా మూడు పదులు దాటిపోతోంది. ఇంకా పెళ్లి చేసుకోవట్లేదు. మరి ముందు ముందు అయినా చేసుకుంటుందో లేదో చూడాలి.
Read Also : Shriya Saran Commented On Producer : ఆ నిర్మాత ఒంటరిగా రూమ్ కు రమ్మన్నాడు.. శ్రియ సంచలన వ్యాఖ్యలు..!