Anchor Sreemukhi : బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి పరిచయం అక్కర్లేదు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అమ్మడికి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆమె చేతిలో ఉన్నన్ని ఆఫర్లు ఇంకెవరి చేతిలో లేవనే చెప్పుకోవాలి. ఏ ఛానెల్ పెట్టినా ఆమెనే కనిపిస్తోంది. ఓటీటీని కూడా వదలట్లేదు. అంత బిజీ యాంకర్ అయిపోయింది.
మరి ఆమె ఈ స్థాయికి రావడానికి పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. కేవలం తన ట్యాలెంట్ ను నమ్ముకుని ఈ స్థాయికి వచ్చింది. మరి తెరపై ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే శ్రీముఖి లైఫ్ లో కూడా చాలా విషాదం ఉంది. ఈ విషయాలను ఆమెనే గతంలో చెప్పింది. నేను చదువుకునే రోజుల్లోనే ఓ వ్యక్తిని ప్రేమించాను.
కానీ అతను నాతో ప్రేమగా ఉంటూనే మరో రిలేషన్ పెట్టుకున్నాడు. ఈ విషయం నాకు తెలిసి చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. అతనితో బ్రేకప్ చేసుకున్నాను. కానీ అతనితో లైఫ్ ను ఊహించుకుంటే ఇంత మోసం చేస్తాడా అని చాలా బాధ పడ్డాను. ఇంకా చెప్పాలంటే చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను.
సూసైడ్ చేసుకుని చనిపోదామనుకున్నాను. కానీ నా తల్లిదండ్రుల వల్ల మళ్లీ నార్మల్ పొజీషన్ కు వచ్చాను. అప్పటి నుంచి నా కెరీర్ మీద దృష్టి పెడుతున్నా. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కచ్చితం నా తల్లి ఇందుకు కారణం అంటూ ఎమోషనల్ కామెంట్లు చేసింది శ్రీముఖి. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Also Read : Tollywood : టాలీవుడ్ లో అత్యధిక అమ్మాయిల ఫాలోయింగ్ ఉన్న హీరో అతనే..!
Also Read : Sai Pallavi : మహేశ్ బాబు సినిమాను రిజెక్ట్ చేసిన సాయిపల్లవి.. ఎందుకో తెలుసా..?