Anjali Devi: అంజలి దేవి తన జన్మ రహస్యాన్ని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు ఆ రహస్యమేమిటో మీకు తెలుసా…?

Anjali Devi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలా మంది హీరోయిన్లు వస్తున్నారు ఇప్పుడైతే రోజుకో హీరోయిన్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు అనతికాలంలోనే కనుమరుగైపోతున్నారూ కానీ అప్పట్లో కొంతమంది హీరోయిన్లు ఇండస్ట్రీకి వచ్చారు అంటే వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు తన నటనతో అందరిని ఆకర్షిస్తూ అలాగే ఇండస్ట్రీలో వాళ్ళ కెరియర్ ని బాగా ప్లాన్ చేసుకునేవారు. అయితే అప్పట్లో అంజలీదేవి గారు మంచి సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు సాధించారు ఆవిడ మొదటగా […].

By: jyothi

Published Date - Thu - 26 August 21

Anjali Devi: అంజలి దేవి తన జన్మ రహస్యాన్ని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు ఆ రహస్యమేమిటో మీకు తెలుసా…?

Anjali Devi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలా మంది హీరోయిన్లు వస్తున్నారు ఇప్పుడైతే రోజుకో హీరోయిన్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు అనతికాలంలోనే కనుమరుగైపోతున్నారూ కానీ అప్పట్లో కొంతమంది హీరోయిన్లు ఇండస్ట్రీకి వచ్చారు అంటే వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు తన నటనతో అందరిని ఆకర్షిస్తూ అలాగే ఇండస్ట్రీలో వాళ్ళ కెరియర్ ని బాగా ప్లాన్ చేసుకునేవారు. అయితే అప్పట్లో అంజలీదేవి గారు మంచి సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు సాధించారు ఆవిడ మొదటగా గొల్లభామ అనే సినిమాలో నటించి మంచి గుర్తింపును సాధించారు అయితే ఆ సినిమాలో వ్యాంప్ క్యారెక్టర్ చేశారు ఆ సినిమా లో కిస్ సీన్ లో కూడా నటించే క్యారెక్టర్ కావడంతో ఆవిడ మొదటగా కంగారు పడిపోయింది ఆ తర్వాత డైరెక్టర్

సి.పుల్లయ్య వచ్చి ఆ క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఏంటో చెప్పి అలాగే ఆ కిస్ సీనుని ఎలా చిత్రీకరిస్తామో చెప్పడంతో ఆమె భయపడకుండా నటించింది అయితే ఆ తర్వాత వరుసగా ఆమెకు వ్యాంపు క్యారెక్టర్లు వచ్చాయి ఆ క్యారెక్టర్ లో చేస్తూనే స్వప్న సుందరి అనే సినిమాలో హీరోయిన్ గా నటించిందిఆ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించింది ఆ సినిమాలో హీరోయిన్ గా నటించినందుకుగాను తెలుగు అభిమానులు ఆమె నటనకు ఫిదా అయిపోయారు అప్పటినుంచి ఏ సినిమాలో చూసినా అంజలీదేవి గారు హీరోయిన్ గా నటించే వారు తెలుగులో ఆమె అగ్రహీరోయిన్ గా మంచి పిక్స్ లో ఉన్నప్పుడు కీలుగుఱ్ఱం అనే సినిమాలో ఆమె నటించారు అయితే ఒక టైం లో ఆమెని ఆ సినిమాలో మీరు దయ్యం పాత్రలో నటించారు కదా ఒక అగ్ర హీరోయిన్ అయి ఉండి అలా ఆ పాత్రలో నటించడం మీకు ఏమీ అనిపించలేదా అని అడిగితే ఆమె చిన్నగా నవ్వి నాకు

 

సినిమాలో క్యారెక్టర్ ఏదైతే ఉందో అది నేను చేయగలనా లేదా అనే ఉద్దేశంతో ఆలోచించుకుని చేస్తాను అంతే తప్ప అది ఏ క్యారెక్టర్ అనేది నాకు అవసరం లేదు అని క్లారిటీగా చెప్పేశారు.అయితే ఆవిడ సినిమా ఇండస్ట్రీ కి రావడానికి ముందే కాకినాడ లో కొన్ని నాటకాలు వేసేవారు అక్కడ ఆ నాటకాలకు మ్యూజిక్ కంపోజ్ చేసే ఆదినారాయణని అంజలీదేవి పెళ్లి చేసుకున్నారు అప్పటికే ఆయన కి పెళ్లి అయ్యి పిల్లలు కూడా ఉన్నారు అయిన కూడా ఆయనకి సెకండ్ భార్యగా ఉండడానికి ఇష్టపడి ఆయన్ని పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ జీవితం కూడా చాలా సాఫీగా సాగిపోయింది వీళ్ళకి ఒక బాబు కూడా ఉన్నాడు అయితే ఒకానొక సందర్భంలో ఆవిడ ఆత్మకథ రాయడానికి కొంతమంది జర్నలిస్టులని ఇంటికి పిలిపించినప్పుడు ఆవిడ తను ఒక భోగం వాళ్ళ ఇంట్లో పుట్టానని వాళ్ళు తనని పెంచలేక వేరే వాళ్లకు దత్తత ఇచ్చారని చెప్పారు అది రాసుకునే జర్నలిస్టులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు అప్పటికి ఆమె 350 చిత్రాలకు పైగా సినిమాల్లో నటించి అగ్ర హీరోయిన్ గా గుర్తింపు పొందింది అలాంటిది ఆవిడ తన జన్మ రహస్యం చెప్పడానికి ఏ మాత్రం ఇబ్బంది పడలేదు అని ఆమె ధైర్యానికి అక్కడున్న జర్నలిస్టులు ఫిదా అయిపోయారు. అప్పట్లో ఆవిడ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి అగ్రహీరోయిన్ గా చాలా కాలం పాటు కొనసాగారు. ప్రస్తుతం హీరోయిన్లు అయితే ఒకటి రెండు సినిమాలతో హీరోయిన్లుగా వస్తున్నారు హీరోయిన్ గా కొనసాగే లోపే కనుమరుగై పోతున్నారు కానీ అప్పట్లో అంజలిదేవి, సావిత్రి లాంటి హీరోయిన్లు కొన్ని సంవత్సరాల పాటు అగ్ర హీరోయిన్లుగా తెలుగు తెరపై మంచి గుర్తింపును సాధించికుంటూ ముందుకెళ్లారు. సినిమా ఇండస్ట్రీలో అంజలీదేవి గారి గురించి చెప్పాలంటే ఆవిడ ఒక ధైర్యం ఉన్న హీరోయిన్ గా చెప్పవచ్చు…

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News