Anjali : తెలుగు అమ్మాయి అంజలి అంటే అందరికీ బాగా పరిచయమే. ఆమె తెలుగులో కంటే కూడా తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేసింది. ఆమెకు తమిళంలోనే చాలా స్టార్ స్టేటస్ ఉందని చెప్పుకోవాలి. ఇక తెలుగులో కూడా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, డిక్టేటర్ లాంటి సినిమాలు చేసింది. కానీ తెలుగులో స్టార్ స్టేటస్ ను సంపాదించుకోలేకపోయింది.
అంజలి తెలుగు అమ్మాయి అయినా సరే టాలీవుడ్ లో స్టార్ హీరోలు మాత్రం ఆమెకు అవకాశాలు ఇవ్వలేదు. ప్రస్తుతం తమిళంలోనే ఎక్కువగా నటిస్తోంది. అయితే తాజాగా ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగులో అవకాశాలు రాకపోవడంపై స్పందించింది. నాకు కూడా తెలుగులో అవకాశాలు వచ్చాయి.
కానీ అక్కడ ముంబై హీరోయిన్లతో పోటీ బాగా ఉంటుంది. తెలుగులో కాస్టింగ్ కౌచ్ కు ముంబై హీరోయిన్లు రెడీగా ఉంటారు. వారు ఎలాంటి కమిట్ మెంట్ ఇవ్వడానికైనా సరే ఒప్పుకుంటారు. అందుకే వారికే అక్కడ ఎక్కువగా ఛాన్సులు వస్తాయి. తెలుగు అమ్మాయిలు అలాంటి వాటికి రెడీగా ఉండరు.
అదే మాకు వారికి ఉన్న తేడా. నా లాగే చాలా మంది తెలుగు అమ్మాయిలు టాలీవుడ్ లో అవకాశాలు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. కొందరు చిన్న పాత్రలతో సరిపెట్టుకుంటున్నారు. మా తర్వాత వచ్చేవారికి అయినా తెలుగులో అవకాశాలు రావాలని కోరుకుంటున్నా అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది అంజలి.
Read Also : Akshay Kumar : ఒకప్పుడు హోటల్ వెయిటర్.. ఇప్పుడు ఇండియా సూపర్ స్టార్.. ఎవరో తెలుసా..?
Read Also : Actress Pragathi : ఆ హీరో రాత్రికి రమ్మన్నాడు.. నటి ప్రగతి సంచలన ఆరోపణలు..!