Director Venu Yeldandi : బలగం.. తెలంగాణ నేపథ్యంలో కుటుంబ విలువలు, మానవ సంబంధాలు, హిందూ సాంప్రదాయాల కథాంశంతో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ.. ఈ సినిమాను జబర్దస్త్ కమెడియన్, నటుడు వేణు తెరకెక్కించాడు.. దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.. అతి తక్కువ బడ్జెట్ తో చిన్న సినిమాగా ఈ సినిమాను నిర్మించారు.
అయితే రిలీజ్ తర్వాత చిన్న సినిమానే పెద్ద సినిమాగా మారింది.. బలగం సినిమాకు రోజురోజుకూ ఆదరణ పెరగగా అవార్డులు, అభినందనలతో పాటు కలెక్షన్స్ కూడా బాగా వచ్చాయి.. అయితే ఈ సినిమాకు ఏ రేంజ్ లో కలెక్షన్స్ వచ్చి పేరు తెచ్చుకుందో అదే రేంజ్ లో వివాదాల్లో కూడా నిలుస్తుంది.. ఒక వివాదం ముగిసింది అనుకునే లోపు మరో వివాదం చుట్టూ ముడుతుంది.
ముందుగా బలగం కథ నాది అని వివాదం రేగగా.. ఆ తర్వాత ఓటిటిలో రిలీజ్ అయ్యాక ఊరుల్లో తెరలు కట్టి సినిమా వేయడంతో అమెజాన్ కు దిల్ రాజుకు మధ్య గొడవ జరిగింది.. ఇక ఆ తర్వాత మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ ఫిర్యాదులు వచ్చాయి. ఇలా ఈ సినిమాకు ఏదొక వివాదాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా బలగం డైరెక్టర్ వేణు మీద షూటింగ్ జరుపుకున్న ఇంటి ఓనర్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
సెట్స్ వాడకుండానే బలగం సినిమాను కొలనురు అనే గ్రామంలో షూట్ చేసారు.. తాజాగా ఆ ఇంటి ఓనర్ ఈ సినిమా షూట్ షూట్ 40 రోజుల పైనే మా ఇంట్లో షూట్ జరిగింది.. అన్ని రోజులు మేము బయట వేరే ఇంట్లో ఉన్నాం.. కనీసం డబ్బులు కూడా తీసుకోలేదు.. వేణు మా ఊరి కుర్రాడు అని అనుకున్నాం.. కానీ విజయం తర్వాత కనీసం వేణు ఫోన్ కూడా చేయలేదు.. థాంక్స్ చెప్పలేదు.. అని అన్నారు.. దీంతో వేణుపై చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
Read Also : Ashu Reddy : వాటి సైజు పెంచుకోవడానికి సర్జరీ చేయించుకుంటున్న అషురెడ్డి..!
Read Also : Salman Khan : సల్మాన్ డేటింగ్ చేసిన హీరోయిన్స్ ఎంతమందో తెలుసా.. లిస్టు పెద్దదే!