Anupama Parameswaran Serious About Netizens Trolls : అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు బాగా మారిపోయింది. రౌడీ బాయ్స్ సినిమా రాకముందే అనపమ అంటే అందరికీ ఓ మంచి ఇంప్రెషన్ ఉండేది. ఎలాంటి బోల్డ్ సీన్లలో నటించదు. లిప్ లాక్ సీన్లు, బెడ్ సీన్లు చేయదు అనే ఇమేజ్ ఉండేది. అందుకే ఆమెకు కుర్రాళ్లు చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు.
కానీ అనుపమ రౌడీ బాయ్స్ సినిమా నుంచే అనుపమ రెచ్చిపోతోంది. ఆ సినిమాలో మొదటిసారి లిప్ లాక్ సీన్లు చేసింది. ఇప్పుడు డీజేటిల్లు-2 సినిమాలో కూడా ఇలాంటి బోల్డ్ సీన్లు, లిప్ లాక్ సీన్లు చేయడానికి రెడీ అయిపోయింది. అనుపమను ఇలా చూసి ఆమె ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. దాంతో ఆమెను కొందరు ట్రోల్స్ కూడా చేస్తున్నారు.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనుపమ ఈ ట్రోల్స్ మీద సీరియస్ అయింది. ఒక నటిగా నేను నా కెరీర్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నా. ఒక నటిగా నేను అన్ని సీన్లలో నటించాలని నిర్ణయం తీసుకున్నా. కొన్ని హద్దులు పెట్టేసుకుని ఒక దగ్గర ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇప్పుడు లిప్ లాక్ సీన్లలో నటిస్తున్నా.
అంతే కానీ అదేం నాకు ఫాషన్ కాదు. నా కంటే ముందే చాలామంది హీరోయిన్లు అలాంటి సీన్లు చేశారు. మరి వారిని ఎందుకు ట్రోల్స్ చేయలేదు. వారు చేస్తే తప్పులేదు కానీ.. నేను చేస్తే తప్పు ఎలా అవుతుంది. నన్ను ఎందుకు నెగెటివ్ గా ప్రమోట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అంటూ ఎమోషనల్ కామెంట్లు చేసింది అనుపమ.
Read Also : Renu Desai Unknown Story : ఆ కోరిక తీర్చుకోవడానికి ఇంట్లో నుంచి లేచిపోయిన రేణూ దేశాయ్..!