Apsara Rani Responded On Casting Couch : సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక్కొక్కరు బయటకు వచ్చి కాస్టింగ్ కౌచ్ మీద స్పందిస్తున్నారు. మీటూ ఉద్యమం తర్వాత తమకు జరిగిన అనుభవాలను పంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇక తాజాగా ఆర్జీవీ హీరోయిన్ కూడా ఇలాంటి కామెంట్లే చేసింది. ఆమె ఎవరో కాదు అప్సర రాణి. ఆమె సోషల్ మీడియాలో ఎంత బోల్డ్ గా ఫొటోషూట్లు చేస్తుందో మనం చూస్తున్నాం.
ఆమె కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. తెలుగులో ఆర్జీవీతో రెండు సినిమాలు చేసింది. ఆయన దర్శకత్వంలో వచ్చిన థ్రిల్లర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత డేంజరస్ సినిమాలో లెస్బియన్ గా నటించి.. ఓ రేంజ్ లో బోల్డ్ సీన్లు చేసింది. దాంతో ఆమె పేరు మార్మోగిపోయింది. తాజాగా ఆమె కాస్టింగ్ కౌచ్ మీద స్పందిచింది.
తాను కన్నడ ఇండస్ట్రీలో ఎదుర్కున్న ఘటనను వివరించింది. ఓ డైరెక్టర్ నుంచి నాకు ఆఫీస్ కు రమ్మని ఫోన్ వచ్చింది. సరే అని నేను మా నాన్నను తీసుకెళ్లాను. కానీ మా నాన్నను ఆయన బటయకు పంపించేసి నాతో రూమ్ లో మాట్లాడాడు. నీకు ఛాన్స్ ఇస్తా.. కాకపోతే నా కోరిక తీర్చాలి అంటూ బెదిరించాడు.
నన్ను కాదంటే నీకు ఛాన్సులు రావు అని అన్నాడు. నాకు భయం వేసింది. వెంటనే మా నాన్నను తీసుకుని అక్కడి నుంచి పారిపోయి వచ్చేశాను. కానీ తెలుగు ఇండస్ట్రీలో నాకు అలాంటి అనుభవాలు ఎదురు కాలేదు. ఇక్కడ సినిమా హిట్ అయితే ఆదరిస్తారు. అందుకే తెలుగులో ఎక్కువగా సినిమాలు చేయాలని ఉంది అంటూ చెప్పుకొచ్చింది అప్సర రాణి.