Ariyana Glory:టాలీవుడ్ టెలివిజన్ ఇండస్ట్రీలో యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన నటీనటులు చాలా మందే వెండి తెరపై ఆవిష్కృతమై తమ అదృష్టాన్ని పరిక్షించుకున్నారు. అందులో కొందరు విజయం సాధించగా మరికొందరు పరాజయాలు చవిచూసి తిరిగి తమకు కలిసివచ్చిన దాంతోనే సర్దుకు పోతున్నారు. ఈ కోవలోకి ఎవరెవరు వస్తారో తెలుసుకునే ముందు ఇటీవల టెలివిజన్ యాంకర్‌గా పలు చానెళ్లలో కనిపించి ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ అయిన నటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఆమె మరెవరో కాదు బిగ్‌బాస్ కంటెస్టెంట్ ‘అరియానా గ్లోరి’..
ariyana Glory
హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన అరియానా మొదట పలు టెలివిజన్ షోల ద్వారా బుల్లితెరకు పరిచయైంది. జెమినీ కామెడీ షో, మన స్టార్స్ వంటి ప్రోగ్సామ్స్ లో యాంకర్‌గా చేసింది. మంచి గుర్తింపు పొందిన ‘ఐ డ్రీమ్’ యూ ట్యూబ్ చానెల్‌లో కూడా పలువురి ఇంటర్వ్యూ చేసింది. ఈ క్రమంలోనే గతేడాది వచ్చిన బిగ్‌బాస్ సీజన్-4 గేమ్ షొలో పార్టిసిపేట్ చేసింది. అంతే ఈ అమ్మడు రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈమెలో ఏం నచ్చిందో తెలీదు గానీ, కాంట్రవర్సీలకు కేరాఫ్ అయిన RGV అరియానాతో ఏకంగా ‘జిమ్’ ఎపిసోడ్ చేశాడు.. దీంతో సోషల్ మీడియాలో అరియానే పేరు మారుమోగిపోయింది. ఓవర్ నైట్‌లోనే స్టార్ డమ్ తెచ్చుకుంది.
ariyana Glory
తాజాగా అరియానా గ్లోరి తన ఇన్ స్టా వేదికగా పోస్టు చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. అందులో బ్లాక్ గౌను వేసుకుని మరో విధ్వంసానికి అరియాన తెరతీసినట్టు కనిపిస్తోంది. తన లేలేత పరువాలను గౌను అంచున దాచి కుర్రకారును పిచ్చేక్కిస్తోంది. పిక్స్ పోస్టు చేసి ఇలా రాసుకొచ్చింది.. ‘‘మంచి మనుషులను మాత్రమే తన జీవితంలోకి స్వాగతిస్తానని, ఇలాంటి వ్యక్తులు ఎవరైనా మీ జీవితంలోకి వస్తే గట్టిగా అదిమి పట్టుకోవాలని తెలిపింది’’. కాగా, బ్లాక్ గౌనులో అరియానను చూసి నెటిజన్లు తెగ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ariyana