1989 telugu filmindustry : టాలీవుడ్‌లో 1989లో జరిగిన సంఘటన నభూతో నభవిష్యతి

1989 telugu history : టాలీవుడ్ లో అనే కాకుండా బాలీవుడ్‌ కోలీవుడ్ ఇలా అన్ని భాషల సినిమా పరిశ్రమల్లో ఇండస్ట్రీ హిట్ సినిమాలు అనేవి చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. ఒక సినిమా ఇండస్ట్రీ హిట్ కొడితే ఆ సినిమా వసూళ్లు బ్రేక్‌ చేసేందుకు మరో సినిమా వచ్చేందుకు కొన్ని నెలలు పట్టవచ్చు.. నెలలు పట్టవచ్చు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టగా ఆ రికార్డు బద్దలు అవ్వడంకు చాలా ఏళ్ల […].

By: jyothi

Updated On - Thu - 25 November 21

1989  telugu filmindustry : టాలీవుడ్‌లో 1989లో జరిగిన సంఘటన నభూతో నభవిష్యతి

1989 telugu history : టాలీవుడ్ లో అనే కాకుండా బాలీవుడ్‌ కోలీవుడ్ ఇలా అన్ని భాషల సినిమా పరిశ్రమల్లో ఇండస్ట్రీ హిట్ సినిమాలు అనేవి చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. ఒక సినిమా ఇండస్ట్రీ హిట్ కొడితే ఆ సినిమా వసూళ్లు బ్రేక్‌ చేసేందుకు మరో సినిమా వచ్చేందుకు కొన్ని నెలలు పట్టవచ్చు.. నెలలు పట్టవచ్చు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టగా ఆ రికార్డు బద్దలు అవ్వడంకు చాలా ఏళ్ల సమయం పట్టింది. అత్తారింటికి దారేది సినిమాతో మగధీర రికార్డు బ్రేక్‌ అయ్యింది. ఇక పవన్ అత్తారింటికి దారేది ఇండస్ట్రీ హిట్‌ రికార్డు కొద్ది కాలంకే బ్రేక్‌ అయ్యింది. ప్రస్తుతం ఇండస్ట్రీ హిట్ అంటే బాహుబలి. రెండు వేల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన బాహుబలి 2 సినిమా రికార్డు ఎప్పటికి బ్రేక్ అయ్యేది చెప్పలేం. ఇండస్ట్రీ హిట్ లు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. కాని 1989 లో మాత్రం ఏకంగా మూడు ఇండస్ట్రీ హిట్ లు వచ్చాయి. ఆ మూడు కూడా వరుసగా ఒకదాన్ని మించి మరోటి అన్నట్లుగా వసూళ్లు దక్కించుకుని ఇండస్ట్రీ హిట్ లు గా నిలిచాయి. అందుకే టాలీవుడ్‌ చరిత్రలో 1989 సంవత్సరం చిరస్థాయిగా నిలిచి పోతుంది. 1989 కి ముందు కాని ఆ తర్వాత కాని ఒకే ఏడాది మూడు ఇండస్ట్రీ హిట్ లు అయ్యిందే లేదు. ఆ అరుదైన ఏడాదిలో విడుదల అయిన సినిమాలు ఏంటీ వాటి హీరోలు ఎవరు, హీరోయిన్స్‌ ఎవరు ఇతర విషయాలను తెలుసుకుందాం రండీ..


1989 telugu history

1989 telugu history



1989 లో మొదటగా మెగాస్టార్ చిరంజీవి నటించిన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమా విడుదల అయ్యింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది. టూరింగ్ టాకీస్ ల నుండి సిటీలో ఉండే థియేటర్ల కు జనాలు 50 రోజుల పాటు క్యూ కట్టారు. అత్యధిక థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకోవడంతో పాటు అప్పటి వరకు ఉన్న వసూళ్ల రికార్డును కూడా అత్తకు యముడు అమ్మాయికి మొగుడు క్రాస్ చేశాడు. అప్పట్లోనే దాదాపుగా రూ.5.25 కోట్ల రూపాయల షేర్‌ ను రాబట్టి ఇండస్ట్రీగా నిలిచింది.


1989

1989



సంక్రాంతికి చిరంజీవి అత్తకు యముడు అమ్మాయికి మొగుడు వచ్చి చేసిన సందడి ముగిసిందో లేదో బాలకృష్ణ ‘ముద్దుల మామయ్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా క్లాస్ మాస్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. వంద రోజులు ఈ సినిమా అత్యధిక థియేటర్లలో ఆడటంతో పాటు రూ.5.5 కోట్ల రూపాయల షేర్‌ ను దక్కించుకుని అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమా రికార్డును బ్రేక్‌ చేసింది.


1989

1989



బాలయ్య దక్కించుకున్న రికార్డు బ్రేక్‌ అవ్వడానికి ఎక్కువ సమయం పట్టలేదు. నాగార్జున హీరోగా కొత్త దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన శివ సినిమా అక్టోబర్‌ వచ్చింది. సినిమాను ఇలా కూడా తీస్తారా.. ఇలా కూడా చేయవచ్చా అన్నట్లుగా శివ ఒక ట్రెండ్‌ సెట్టర్ గా నిలిచింది. ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదల అయిన శివ సినిమా ఏకంగా రూ.6.1 కోట్ల వసూళ్లను రాబట్టింది.


1989 shiva

1989 shiva



అలా 1989 లో చిరంజీవి, బాలకృష్ణ మరియు నాగార్జునలు ఇండస్ట్రీ హిట్ లను దక్కించుకున్నారు. ముగ్గురు స్టార్‌ హీరోలు ఇండస్ట్రీలు దక్కించుకోవడం మళ్లీ జరగడం అసాధ్యం. అందుకే టాలీవుడ్‌ లో 1989 లో జరిగిన సంఘటన నభూతో నభవిష్యతి.

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Tags

Latest News

Related News