Actress Aruna Mucherla:తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చి వాళ్ల పరిధి మేరకు నటించి నటులుగా మంచి గుర్తింపును సాధించుకుంటారు. అయితే సినిమా ఇండస్ట్రీలో చాలామంది కెరీర్ అనేది ఫుల్ లెన్త్ ఇండస్ట్రీలో సాగదు కొద్దిరోజుల తర్వాత ఏ నటులు అయిన ఫేడ్ అవుట్ అయిపోవాల్సిందే అది హీరోయిన్ల విషయంలో అయితే మరి తొందరగా జరుగుతుంది అలా సినిమా ఇండస్ట్రీలోకొచ్చి కొన్ని సినిమాలు చేసి నటులుగా మంచి గుర్తింపు సాధించుకున్న తర్వాత సినిమా ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయిన వాళ్ళల్లో ముచ్చెర్ల అరుణ ఒకరు ఇప్పుడు ఆవిడ ఎక్కడున్నారు ఏం
చేస్తున్నారో ఒకసారి తెలుసుకుందాం…
ముచ్చర్ల అరుణ పేరు చెబితే చాలు చాలా మంది ఇట్టే గుర్తుపట్టేస్తారు అయితే ముచ్చర్ల అరుణ కుటుంబంలో సినిమా వాళ్లు ఎవరు లేరు ఇండస్ట్రీకి వచ్చి హీరోయిన్ గా మంచి గుర్తింపు సాధించుకున్నారు మొదటగా తమిళంలో భారతీరాజా తీసిన ఒక సినిమాలో చిన్న వేషం లో నటించి నటిగా మంచి గుర్తింపు సాధించారు ఆ సినిమా విడుదలైన తర్వాత చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత కార్తీక్ హీరోగా వచ్చిన సీతాకోకచిలుక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ సినిమా తర్వాత వరుసగా హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరచుకుంటూ చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది అయిన కూడా ఒక స్టేజ్ దాటిన తర్వాత తనకు హీరోయిన్ గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు రావడం మొదలయ్యాయి దాంతో చిరంజీవి జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయ్ సినిమాలో ఒక మంచి పాత్రలో నటించి నటిగా తన స్థాయిని పెంచుకున్నారు అలాగే చిరంజీవి హీరోగా వచ్చిన అత్తకి యముడు అమ్మాయికి మొగుడు సినిమా లో కూడా నటించినందుకు గాను తనకి మంచి మార్కులే పడ్డాయి. కె విశ్వనాథ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా భానుప్రియ హీరోయిన్ గా వచ్చిన స్వర్ణకమలం సినిమాలో భానుప్రియ ఫ్రెండుగా నటించి తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు.
అలాగే మణిరత్నం దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన గీతాంజలి సినిమాలో నటించి నటిగా అందరిని మెప్పించారు. అయితే తనకు నటిగా మంచి అవకాశాలు వస్తున్న సమయంలోనే ప్రముఖ బిజినెస్ మాన్ ఆయన మోహన్ గుప్త గారిని పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసి నలుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చారు. అయితే ముచ్చర్ల అరుణ ఈమధ్య సోషల్ మీడియాలో ఫోటోలను పెట్టడం వల్ల తన ఫ్యామిలీ గురించి అందరికీ తెలిసింది రీసెంట్ గా ఆమె అమ్మమ్మ కూడా అయ్యారు తన కూతుళ్ల ఫోటోలను చూస్తే తనకంటే అందంగా ఉన్నారు అలాగే వాళ్ళు చాలా టాలెంటెడ్ పర్సన్స్ కూడా ఒక కూతురు డాక్టర్, ఇంకో కూతురు ఆర్కెటెక్ట్ ఇలా వాళ్ల కూతుళ్లు ఒక్కొక్కరు ఒక్కొక్క రంగానికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఆ ఫోటోలను చూసిన ముచ్చర్ల అరుణ అభిమానులు మళ్లీ మీరు ఎప్పుడు సినిమాల్లోకి వచ్చి నటిస్తారు మేడం అని కామెంట్ రూపంలో తనకు తెలియజేస్తున్నారు. మొత్తానికి అయితే ముచ్చర్ల అరుణ ప్రస్తుతానికి తన భర్త పిల్లలతో కలిసి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారని తెలుస్తుంది