Heroes Names: పేర్లు వేరు వుంటాయి కొందరి విషయంలో. తమ అభిమాన హీరోల అసలు పేర్లు తెలుసుకోవడమంటే అభిమానులకు అదో కిక్కు. అభిమానులనేవారికి తమ అభిమాన హీరోల పేర్లు తెలియకుండా వుంటాయా? ఛాన్సే లేదు. వెండితెరపై వెలిగిపోయే క్రమంలో రకరకాల కారణాలతో పేర్లు మార్చుకున్న చాలామంది హీరోలున్నారు. తెలుగునాట మెగాస్టార్.. అనిపించుకుంటోన్న చిరంజీవికీ అసలు పేరుంది. నేచురల్ స్టార్ నానికీ అసలు పేరు ఇంకోటుంది. చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా చాలా పెద్దదే.
మెగాస్టార్ చిరంజీవి :
heroes original names chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు ఏంటంటే..
చిరంజీవి అసలు పేరు కొణిదెల శివ శంకర్ వరప్రసాద్. కానీ, వెండితెరపై చిరంజీవిగా పరిచయమయ్యారాయన. ఆంజనేయ స్వామి భక్తుడు కదా.. చిరంజీవి పేరు ఆయనకు అలా అతికినట్టు సరిపోయింది. పైగా, అంజనాదేవి కుమారుడాయె. కొణిదెల అనే ఇంటి పేరుతోనూ, శివ శంకర వరప్రసాద్ అనే పేరుతోనూ (పాత్రల పేరు) పలు సినిమాల్లో చిరంజీవి నటించారు కూడా. అభిమానులు ఎలా పిలిచినా అది ఆనందమేనని చెప్పే చిరంజీవి, ‘మా చిరంజీవి’ అని అందరూ అనుకోవాలన్నదే తన కోరిక.. అని చెబుతుంటారు.
నేచురల్ స్టార్ నాని :
heroes original names nani
నేచురల్ స్టార్ నాని వెనుక ఇంకో పేరుందండోయ్..
వెండితెరపై సహజ సిద్ధమైన నటనకు పెట్టింది పేరు ఆ హీరో. ఆయనే నేచురల్ స్టార్ నాని. చాలాకాలం పాటు, తన అసలు పేరు కూడా ‘నాని’ అంటూ టీజ్ చేస్తూ వచ్చిన నాని, ఓ సందర్భంలో తన అసలు పేరుని గంటా నవీన్ బాబు.. అని చెప్పక తప్పలేదు.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అసలు కథ ఇదీ..
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు :
heroes original names mohanbabu
నటుడు, నిర్మాత ‘కలెక్షన్ కింగ్’ మోహన్ బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడు. కానీ, ఆయనకు వెండితెరపై ‘మోహన్ బాబు’ అనే పేరు పెట్టారు. ఆ పేరు పెట్టింది కూడా దర్శకరత్న దాసరి నారాయణరావు కావడం గమనార్హం. తనకు సినీ పరిశ్రమలో నటుడిగా అవకాశాలు కల్పించి, ప్రోత్సహించిన దాసరికి ఎప్పటికీ రుణపడి వుంటానని చెబుతుంటారు మోహన్ బాబు.
.
మాస్ మహరాజ్ రవితేజ :
heroes original names ravi teja
మాస్ మహరాజ్ రవితేజ అసలు పేరేంటో తెలుసా.? భూపతిరాజు రవి శంకర్ రాజు. ఈ పేరు చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు. దర్శకత్వం చేయాలన్న ఆలోచనతో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి, అనుకోకుండా నటుడై, చిన్నా చితకా పాత్రలు పోషించి.. బాక్సాఫీస్ వద్ద మాస్ మహరాజ్.. అనిపించుకున్న రవితేజకి, బహుశా ఆ పేరే ఇంత పెద్ద లక్కు తెచ్చిపెట్టిందేమో .
వైభవ్ :
heroes original names vibhav
ప్రముఖ దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్ అసలు పేరు సుమంత్. ఆ పేరుని వైభవ్.. అని మార్చారు. తెలుగులో ‘గొడవ’ సినిమా చేసిన ఈ యువ హీరో, తమిళంలో పలు సినిమాలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. చెప్పుకుంటూ పోతే అసలు పేర్లకీ, సినిమా హీరోలయ్యాక మారిన పేర్లకీ అస్సలు పొంతన లేదు. పేర్లు మార్చుకున్నాక చాలామందికి లక్కు కలిసొచ్చిందని అంటారు సినీ జనాలు.
కొంతమంది హీరోలైతే, లక్కు కోసం అసలు పేర్లను మార్చుకోకుండా స్పెల్లింగ్ మార్పులు చేసుకుంటుంటారు. ‘ఆర్’ అనే అక్షరాన్ని ఎక్కువమంది యంగ్ హీరోలు అదనంగా జోడిస్తుంటారు. ‘ఎన్’ అనే అక్షరం కూడా అదనంగా జోడిస్తే కొందరికి లక్కు కలిసొచ్చింది. ఎవరి సెంటిమెంట్లు వాళ్ళవి. అన్నట్టు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అసలు పేరు కొణిదెల కళ్యాణ్ బాబు.. ఆ పేరుకి అదనంగా ‘పవన్’ చేర్చారు. అది చిరంజీవి సూచన మేరకే జరిగింది.