B. Gopal : ‘సమరసింహారెడ్డి’ సినిమాలో సుమోలు లేవడానికి కారణం ఆయనే అంటున్న గోపాల్..

B. Gopal : ‘ప్రతిధ్వని’ చిత్రం తీసి అప్పట్లోనే బెస్ట్ డైరెక్టర్‌గా నంది అవార్డు అందుకున్నాడు డైరెక్టర్ బి.గోపాల్. పలు చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి ఆ తర్వాత డైరెక్టర్ అయిన బి.గోపాల్ రెండు హిందీ చిత్రాలనూ డైరెక్ట్ చేశాడు. అయితే, బి.గోపాల్ అనగానే తెలుగు సినీ ప్రేక్షకులకు గుర్తొచ్చేది ఆయన తీసిన యాక్షన్ సినిమాలనే చెప్పొచ్చు. నందమూరి బాలకృష్ణతో బి.గోపాల్ తీసిన చిత్రాలన్ని సూపర్ హిట్ అవ్వడమే కాదు.. ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాయి కూడా. […].

By: jyothi

Published Date - Mon - 25 October 21

B. Gopal : ‘సమరసింహారెడ్డి’ సినిమాలో సుమోలు లేవడానికి కారణం ఆయనే అంటున్న గోపాల్..

B. Gopal : ‘ప్రతిధ్వని’ చిత్రం తీసి అప్పట్లోనే బెస్ట్ డైరెక్టర్‌గా నంది అవార్డు అందుకున్నాడు డైరెక్టర్ బి.గోపాల్. పలు చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి ఆ తర్వాత డైరెక్టర్ అయిన బి.గోపాల్ రెండు హిందీ చిత్రాలనూ డైరెక్ట్ చేశాడు. అయితే, బి.గోపాల్ అనగానే తెలుగు సినీ ప్రేక్షకులకు గుర్తొచ్చేది ఆయన తీసిన యాక్షన్ సినిమాలనే చెప్పొచ్చు. నందమూరి బాలకృష్ణతో బి.గోపాల్ తీసిన చిత్రాలన్ని సూపర్ హిట్ అవ్వడమే కాదు.. ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాయి కూడా. అటువంటి చిత్రాల్లో ఒకటి ‘సమరసింహారెడ్డి’. ఈ మూవీలో సుమోలు ఎగరడానికి కారణమైంది ఎవరో తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు గోపాల్.

అబద్దాన్ని అందంగా అందరూ నమ్మేట్లుగా చెప్పడమే తన దృష్టిలో సినిమా అని చెప్పిన డైరెక్టర్ బి.గోపాల్.. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో ‘సమరసింహారెడ్డి’ ఫిల్మ్ బాగా ఆడిందని చెప్పుకొచ్చాడు. ఆ చిత్రంలో ఫైట్స్ అన్ని కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయని, ముఖ్యంగా నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేశారని తెలిపాడు. ఇకపోతే తన సినిమాల్లో సందర్భానుసారమే ఫైట్స్ తీశానని, అనవసరంగా ఫైట్స్ జోలికి పోలేదని చెప్పాడు.

‘సమరసింహారెడ్డి’ చిత్రంలో సుమోలు లేపినపుడు తమను ఎవరూ ఏమీ అనలేదని, పైగా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందని తెలిపాడు. ముఖ్యంగా నందమూరి అభిమానులు బాగా థ్రిల్ అయ్యారన్నాడు గోపాల్. ఆ ఫిల్మ్‌లో బాలకృష్ణ ఫ్యామిలీని విలన్స్ చంపిస్తే వారి మీదకు బాలకృష్ణ వెళ్లి ఫైట్ చేయడం, ఆ క్రమంలోనే సుమోలు లేవడం అనేది బాగా పాపులర్ అయిందని, ఆ సీన్ ఇప్పటికీ చాలా బాగుంటుందని చెప్తూ ఆనందపడిపోయాడు డైరెక్టర్ గోపాల్. ఈ చిత్రానికి పరచూరి బ్రదర్స్ స్టోరి అందించగా, ‘బాహుబలి’ రచయిత కె.విజయేంద్ర‌ప్రసాద్ స్క్రీన్ ప్లే అందించారు. అయితే, ‘సమరసింహారెడ్డి’ సినిమాలో సుమోలు లేవడానికి ముఖ్యకారణం విజయేంద్రప్రసాదేనని తెలిపాడు గోపాల్.

ఇకపోతే ఈ క్రమంలోనే బి.గోపాల్ తన డైరెక్షన్‌లో బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘నరసింహనాయుడు’ సినిమా గురించి ప్రస్తావించారు. ఆ చిత్రంలో ట్రైన్ ఎపిసోడ్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసిందని, ఇప్పటికీ ఆ సీన్ చూసి నందమూరి అభిమానులు, సినీ ప్రేక్షకులు థ్రిల్ ఫీలవుతారని వివరించాడు డైరెక్టర్ గోపాల్.

ట్రైన్ ఎపిసోడ్‌లో హీరోయిన్ అన్నయ్యలు బాలకృష్ణను ఫాలో అయ్యే సీన్‌కు మంచి పేరొచ్చిందని గుర్తు చేసుకున్నాడు. బాలకృష్ణ తన ఫ్యామిలీని తీసుకుని ట్రైన్ ఎక్కిస్తున్నపుడు విలన్స్ గొడ్డలి విసిరితే అది బాలకృష్ణకు తగలే సీన్ గురించి డైరెక్టర్స్ , రైటర్స్ చాలా మంది తన వద్ద ప్రస్తావించారని, ఆ సీన్ చూసి తమ రోమాలు నిక్కపొడుచుకున్నాయని సగర్వంగా చెప్పారని అన్నాడు. అయితే, ‘నరసింహానాయుడు’ సినిమాలో సుమోలు కాకుండా జీపులు గాలిలోకి లేవడం గమనార్హం. కాగా, ఇలా జీపులు పైకి లేవడానికి ఇందులో కారణం చిన్నికృష్ణ అని బి.గోపాల్ తెలిపాడు.

Tags

Latest News

Related News