Mahesh Babu : ఏంటి వినగానే కొంచెం షాక్ అవుతున్నారా.. మహేశ్ బాబు వల్ల పవన్ స్టార్ హీరో అవ్వడం ఏంటని అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం ఆగండి. ఇప్పుడు పవన్ కల్యాణ్ ను అందరూ పవర్ స్టార్ అని పిలుచుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయన క్రేజ్ ఏ స్టార్ హీరోలకు కూడా లేదనే చెప్పుకోవాలి.
పవన్ కల్యాణ్ కు మాత్రం వీరాభిమానులు ఉంటారు. అయితే పవన్ కల్యాణ్ ను స్టార్ హీరోను చేసింది మాత్రం పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన బద్రి సినిమా. ఈ సినిమాతోనే పవన్ ను అందరూ పవర్ స్టార్ అంటూ పిలుచుకోవడం మొదలు పెట్టారు. అయితే పవన్ కల్యాణ్ తో చేసిన ఈ సినిమా పూరీకి మొదటిది.
కానీ ఆయన ఈ సినిమాను ముందుగా మహేశ్ బాబుతో చేయాలని అనుకున్నారంట. మహేశ్ బాబుకు కథ కూడా చెప్పారంట పూరీ. కానీ ఎందుకో ఆయన ఈ సినిమాపై అంతగా ఆసక్తి చూపలేదు. దాంతో పవన్ వద్దకు ఈ సినిమా వచ్చింది. పవన్ కూడా పూరీతో సినిమా చేస్తానని గతంలో మాట ఇచ్చారు.
ఆ మాట కోసమైనా సరే అని చేద్దామన్నారు. అలా పట్టాలెక్కిన ఈ మూవీ.. సంచలన విజయాన్ని నమోదు చేసింది. అప్పట్లో పవన్ మేనరిజాన్ని పరిచయం చేసింది కూడా ఈ సినిమానే. దీంతోనే ఆయనకు స్టార్ ఇమేజ్ వచ్చి పడింది. ఒకవేళ మహేశ్ చేసి ఉంటే పవన్ అంత త్వరగా స్టార్ హీరో అయ్యేవాడు కాదేమో.
Read Also : Ram Gopal Varma : పవన్ కల్యాణ్ ఒక దద్దమ్మ.. ఆర్జీవీ సంచలన విమర్శలు..!
Read Also : Naga Babu : నాగబాబు వల్ల తాగుబోతుగా మారిన స్టార్ కమెడియన్.. ఎంత పని చేశావయ్యా..!