Balagam Movie : బలగం సినిమాకు ఎన్ని కోట్ల లాభం వచ్చిందో తెలుసా.. ఇది కదా జాక్ పాట్..!

Balagam Movie : దిల్ రాజు కూతురు హన్షిత, హర్షిత్ రెడ్డిలు కలిసి నిర్మించారు బలగం మూవీని. ఈ సినిమా మొదట్లో రూ.1.15 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో దీన్ని దిల్ రాజు స్టైల్‌లో భారీ స్థాయిలో రిలీజ్ చేశారు..

By: jyothi

Updated On - Mon - 15 May 23

Balagam Movie : బలగం సినిమాకు ఎన్ని కోట్ల లాభం వచ్చిందో తెలుసా.. ఇది కదా జాక్ పాట్..!

Balagam Movie : చిన్న సినిమాలో కంటెంట్ ఉంటే దుమ్ము లేపుతుందని తాజాగా వచ్చిన బలగం సినిమా మరోసారి నిరూపించింది. ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అనే తేడాలు లేకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే చిన్న సినిమాగా వచ్చి చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు ఏ చిన్న సినిమాకు రానన్ని లాభాలు తెచ్చిపెట్టింది.

దిల్ రాజు కూతురు హన్షిత, హర్షిత్ రెడ్డిలు కలిసి నిర్మించారు మూవీని. ఈ సినిమా మొదట్లో రూ.1.15 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో దీన్ని దిల్ రాజు స్టైల్‌లో భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో సూపర్ హిట్ నుంచి డబుల్ బ్టాక్ బస్టర్ హిట్ వరకు దూసుకెళ్లింది.

తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 12.35 కోట్లు షేర్‌ను రాబట్టింది బలగం సినిమా. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి దీనికి ఫుల్ రన్‌లో రూ. 20 లక్షలు షేర్ వసూలు అయింది. అన్ని భాషల్లో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.12.55 కోట్లు షేర్‌తో పాటు రూ. 27.30 కోట్లు గ్రాస్‌ వసూళ్లు వచ్చాయి.

ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.1.31 కోట్లుగా నమోదైంది. ఇక, ఫుల్ రన్‌లో ఈ సినిమాకు రూ. 12.55 కోట్లు వచ్చాయి. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు దిల్ రాజు కూతురికి రూ. 11.25 కోట్ల లాభాలు దక్కాయి. ఇంత మొత్తంలో భారీగా వసూళ్లు సాధించాయంటే మామూలు విషయం కాదనే చెప్పుకోవాలి.

 

Read Also : Krithi Shetty : నానితో లిప్ లాక్ చేయడం అస్సలు ఇష్టం లేదు.. పరువు తీసేసిన కృతిశెట్టి..!

Read Also : VK Naresh : జల్సా కింగ్ నరేశ్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా.. స్టార్ హీరోలను మించి..!

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News