NTR-Balayya : ఎన్టీఆర్ ను బండబూతులు తిడుతున్న బాలయ్య ఫ్యాన్స్.. ప్లాన్ ప్ర‌కార‌మే జ‌రుగుతోందా..?

NTR-Balayya : తెలుగు సినీ పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు, స్థానాన్ని సంపాదించిన కుటుంబం నందమూరి కుటుంబం. నందమూరి తారకరామారావు ఈ కుటుంబానికి ఆద్యుడు కాగా.. .

By: jyothi

Published Date - Tue - 27 September 22

NTR-Balayya : ఎన్టీఆర్ ను బండబూతులు తిడుతున్న బాలయ్య ఫ్యాన్స్.. ప్లాన్ ప్ర‌కార‌మే జ‌రుగుతోందా..?

NTR-Balayya : తెలుగు సినీ పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు, స్థానాన్ని సంపాదించిన కుటుంబం నందమూరి కుటుంబం. నందమూరి తారకరామారావు ఈ కుటుంబానికి ఆద్యుడు కాగా.. ఆయన వారసత్వాన్ని నందమూరి బాలయ్య కొనసాగిస్తుండగా, మరో తరంలో నందమూరి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు కొనసాగిస్తున్నారు.

నందమూరి కుటుంబంలో ఎంతో మాస్ బేస్, తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న స్టార్ హీరో నందమూరి మనవడు జూనియర్ ఎన్టీఆర్. సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ స్టార్.. తన కెరీర్ గ్రాఫ్ ను అలా పెంచుకుంటూ పోతున్నాడు. కాగా నందమూరి కుటుంబంలోని సభ్యులు అంతా ఒకటిగా ఉన్నా.. నందమూరి అభిమానులు మాత్రం అప్పుడప్పుడు వేరుగా ఉంటున్నారు.

నందమూరి బాలయ్య ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య తలెత్తిన వివాదం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. నందమూరి బాలయ్య ఫ్యాన్స్ రెచ్చిపోయి జూనియర్ ఎన్టీఆర్ గురించి తప్పుగా మాట్లాడటం, వివాదంలోకి ఆయన కుటుంబ నేపథ్యాన్ని కూడా లాగడం వివాదాస్పదమైంది.

ఇంతకీ ఏం జరిగిందంటే..

తాజాగా నందమూరి బాలయ్య చేసిన ‘చెన్నకేశవరెడ్డి’ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా విడుదలైన సందర్భంగా నందమూరి బాలయ్య ఫ్యాన్స్ సందడి చేశారు. అయితే ఓ థియేటర్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడటంతో వివాదం మొదలైంది. నందమూరి బాలయ్య, ఎన్టీఆర్ అభిమానుల మధ్య మాటల యుద్ధం మొదలవడం, ఇద్దరు తీవ్రంగా తిట్టుకోవడం జరిగింది.

Read Also : Viral Video: తల్లి గొంతుపై కాలితో తొక్కుతూ చిత్రహింసలు..వీడియో వైరల్

Read Also :Marriage Loan: పెళ్లిళ్ల కోసం అప్పులు ఇస్తున్న కార్పొరేట్ కంపెనీలు.. కొత్త ట్రెండ్

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News